Others

సమానతే లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సమాజంలో సంప్రదాయ జీవన విధానానికి పాశ్చాత్య నాగరికత, సంస్కృతి చొచ్చుకొని రావటం కారణంగా ప్రభావితమైన విలువలు, దైనందిన నడవడిక, ఆలోచనలతో జీవితాలను మలుపు తిప్పుతున్నాయి. స్ర్తి పురుషులు కలిసికట్టుగా, సామాజిక నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణాయుతంగా మత ధర్మాచరణతో, ఎప్పటికప్పుడు సంస్కరణలను ఔదలదాలుస్తూ జీవన సంక్షేమ ప్రగతికి, ప్రశాంతతకు కట్టుబడి జీవించడం అనాదిగా వస్తోంది. మేధావంతులైన స్ర్తి, పురుషులు ఏ రంగంలో వున్నా అత్యధిక శాతం జనావళిని ప్రభావితం చేస్తూనే వుంటారు. కానొక కాలంలో పరస్పర అవసరాలకు అనుగుణంగా కలిసి జీవించే స్ర్తి, పురుష బాంధవ్యం చాపక్రింద నీరులా పురుషాధిపత్యం ఆమోదింపబడే స్థితిగతులలో కొనసాగేది. అయిదు దశాబ్దాల క్రితం నాటి ప్రపంచ స్వరూపానికి విభిన్నంగా, కాలానుగుణంగా సంతరించుకొన్న శాస్త్ర, సాంకేతిక అత్యాధునిక ఉత్తేజంతో ప్రపంచం ప్రస్తుతం జీవిస్తోంది. భారతీయ మహిళ జీవనశైలి, జీవించే కార్యాచరణను నేటి పరిస్థితులకు అనుగుణంగా సవరించుకొంటూ ఇంతవరకు మతం, ప్రకృతి ప్రసాదించని, ‘సమానత’ సాధించే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. ప్రపంచం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి, కేవలం రెండు దాశాబ్దాలయినా గత శతాబ్దపు సంకెళ్ళు ఛేదించుకొని, స్వేచ్ఛా సమానత సాధించే దిశలో మహిళా ప్రపంచం తీవ్రంగా తపిస్తోంది. అందులో అంతర్భాగంగానే ‘మీటూ’ తిరుగుబాటు పోకడలు స్పష్టమవుతున్నాయి.
సృష్టి ఆవిర్భావానికి అత్యంత ప్రధానమైన ప్రకృతి సహజ ధర్మమైన స్ర్తి పురుష కలయిక, వనాకర్షణ, పరస్పర లైంగిక అవసరాల ప్రాధాన్యతలో కొనసాగతుంది. వైవాహిక వ్యవస్థ నాందిగా కుటుంబ వ్యవస్థ ప్రశాంత జీవన గమ్యాన్ని నిర్దేశిస్తోంది. బాల్యం, వనం, వధ్య, వృద్ధాప్య దశలలో ఈ బాంధవ్యం రక్షణ, భద్రత ప్రసాదిస్తోంది. బాధ్యతాయుతమైన భవిష్యత్ సమాజ కల్యాణానికి ఆ బాంధవ్య కలయిక పునాదులు వేసింది. వయస్సుతో లైంగిక ఆకర్షణలకు కళ్ళెం పడినా, మత దైవత్వం ప్రబోధించే నైతిక ధర్మాలకు కట్టుబడి మానవాళి జీవించగలుగుతుంది.
మగపీడన ప్రకంపనాలు
భారతీయ మహిళకు సంబంధించి యుగాల పరిభ్రమణం నాటి జీవన స్థితిగతులు ఎలా వున్నా, పాతివ్రత్య, ఆచార ధర్మాల నైతిక ప్రవర్తనలు ఎలా వున్నా సుమారు 700 సంవత్సరాల విదేశీ పాలన ప్రభావం కొట్టొచ్చినట్టు స్పష్టమవుతోంది. అన్యాయ, అణచివేత, ఆక్రోశనలపట్ల వితండవాదాలున్నాయి. మత విశ్వాసాలు ప్రగాఢంగా వున్నాయి. అయినా ఆధునిక మహిళ సాధికారత, సమానత పురుషులతో పోరాడి సాధించే దిశలో, తనకు అందుబాటులో వున్న అవకాశాలను అందిపుచ్చుకొని ప్రస్తుత మహిళా మేధావివర్గం ఎదురుతిరిగి ప్రశ్నిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకోసం సమాజ నైజాన్ని ధిక్కరిస్తోంది. ఆడతనం పట్ల పురుషుని మైండ్ సెట్ మార్చటానికి ప్రతిఘటనోద్యమాలతో ఎలుగెత్తి చాటుతోంది. గడప దాటని మహిళ స్వేచ్ఛకోసం నినదిస్తోంది. అమానుష అత్యాచారాలు, హింసా ద్వేషాలు, మహిళను ఆస్తిగా భావించే ఆధిపత్యం, వ్యక్తిత్వాల స్వేచ్ఛను హరించే సనాతన సంప్రదాయాలు, మగపీడనను ఎదుర్కొనే సంఘటిత పోరాటాలతో పురుష ప్రపంచాన్ని నిలదీస్తోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడతనంపై ఘోర నేర అకృత్యాల లైంగిక దుష్టత్వాన్ని ప్రతిఘటించే దిశలో చర్యలలో భాగంగా, ఆ వికృత ధోరణులపై సంఘటితసమరం వెలుగుచూస్తోంది. ప్రస్తుత వర్తమానాంశంగా ‘మీటూ’ ఉద్యమం తలఎత్తింది.
పాశ్చాత్య సంపన్న దేశాలు ఎంత శాస్ర్తియ ప్రగతి సాధిస్తున్నా మహిళలపట్ల అసమానత, వివక్షత, అన్యాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఇది నా శరీరం, నా ఇష్టం. డ్రెస్ ఏదైనా రేపిస్టుల ఆకలి చూపులు ఎందుకు వేధిస్తున్నాయి?’’ అంటూ మహిళ నిలదీస్తోంది. ఏ దేశ చరిత్ర చూసినా ప్రతిభావంతులైన మేధావులు సెక్స్ నేరాలలో బయటపడితే మీడియాకు చేతినిండా పనే. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక మేధావి, ఆస్కార్ అవార్డు విజేత పొలన్‌స్కీ, 40 ఏళ్ళ క్రితం 13 ఏళ్ళ సమంత గైమర్‌తో సెక్స్ దౌర్బల్యానికి లోనైనట్టు అంగీకరించటంతో ఆయనకు నేటికీ, లాస్ ఏంజిల్స్‌లో 50 ఏళ్ళు శిక్ష విధించే న్యాయం పొంచివుంది. ఆ మహిళకు ప్రస్తుతం 54 ఏళ్ళు వుండగా పోలన్‌స్కీ, 85 ఏళ్ళ వృద్ధుడు. ‘మీటూ’ ఉద్యమంగా అటువంటి నేరారోపణలు ఎన్నో ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి.
మేధావులైతేనేం?
హిందు, ఇస్లామ్, క్రైస్తవ ఇతర మత విశ్వాసాల ప్రగాఢ ప్రభావం మహిళా ప్రపంచాన్ని శాసిస్తున్నా, అత్యాధునిక మహిళ పురుషాధిక్యతను, లైంగిక ఉన్మాదాన్ని నిరసిస్తూ ఎదురు ప్రశ్నిస్తోంది. మద్యం, మదోన్మత్తత, మానసిక దౌర్బల్యాన్ని క్షమించి తాను నిస్సహాయం నిర్బలత్వంతో బలి అయిన చిన్ననాటి దుర్గటనలపట్ల విద్యాధికులైన, ప్రతిభావంతులైన మధ్య వయస్సులైన మహిళలు బాహాటంగా ‘మీటూ’ ఉద్యమంలో ‘మాకు సైతం’ అంటూ గళం విప్పి న్యాయ పోరాటాలకు సిద్ధం అవుతున్నారు. శారీరకంగా సహజమైన రుతుక్రమ తత్కాల స్థితిగతులు అపవిత్రంగా భావించి తమకు దైవ సందర్శనం పట్ల ఆంక్షలు విధించడం పట్ల ప్రస్తుత భారతీయ మహిళా సమాజం గందరగోళంగా చిక్కుకొంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలక్, హాజీ అలీ మసీదు, శనిసింగనాపూర్, అయ్యప్ప ఆలయ ప్రవేశాలపై తీర్పులతో మహిళా లోకానికి బాసటగా ప్రసాదించిన న్యాయం కొండంత అండ అయింది.
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు
ప్రస్తుతం మన దేశంలో వివిధ రంగాల విద్యాధికులు, మేధావంతులు, జర్నలిస్టులు, ఇతర రంగాల మహిళలుకూడా సాహసంగా గుట్టు రట్టు చేస్తూ గళం విప్పే పోరాటాలకు నాంది అయింది. తనుశ్రీదత్తా, ఘజలా వాహబ్, వినితా నందా- ఎందరో ఎన్నో ఆరోపణల కథనాలు. అమెరికాలో చిత్ర నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమం ఊపు అందుకొన్న తరుణంలో ‘డియర్ మేల్ బాస్’లకు ఇండియాలో కూడా గుండెల్లో రైళ్ళు పరుగెత్తే సంచలన కథనాలు వెలుగు చూస్తున్నాయి. వెల్లువలా లైంగిక వేధింపులకు నిస్సహాయంగా ఎపుడో బలి అయిన ఆరోపణలు పురుష ప్రపంచాన్ని తెల్లారితే ఎవరు? అనే ఆందోళన వెంటాడుతోంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ మీటూ ఉద్యమానికి తలవంచి మంత్రి పదవికి రాజీనామా చేయటంతో ‘మీటూ’ అత్యంత ప్రధానమైన రాజకీయ రం గాన్ని నిలదీయటం పతాక స్థాయి ఆరోపణగా తీవ్రరూపం దాల్చింది.

-జయసూర్య 94406 64610