Others

అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతగొప్పది
అంతరంగం!
అంతా తానై...
మనల్ని నడిపించినా..
కంటి కెమెరాకు చిక్కదు!
గుప్పెట్లోకి దొరకదు!

ఒక్కోసారి ఎడారిలో
నీటి స్వప్నంలా..
ఊరటనివ్వని జీవితాన్ని ప్రసాదిస్తుంది!

అంతరంగ సాగరంపై
తరంగాలై..
జ్ఞాపకాల దొంతరలతో
దాగుడుమూతలాడుతూ..
ఊహల పల్లకీలో ఊరేగిస్తుంది!

మన ఆలోచనా గీతికలకు
పల్లవి మాత్రమే కాదు..
చరణాలూ తానే అయి
తన చరణదాసున్ని
చేసుకుంటుంది!

వెలుగు నుండి
అంధకారంలోకి..
అంధకారం నుండి
వెలుగులోకి
లాక్కొని వెళ్తూ..
గత, వర్తమానాలను
ముడిపడేలా చేస్తుంది!

-దాస్యం సేనాధిపతి 9440525544