Others

ప్రశ్నకు బదులేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరం
అంగీలు మార్చి మార్చి
అలసిపోయాడు అతను

వేసిన గుండి వేయకుండా
సంకరజాతి గుండీలను
మార్చి మార్చి వేశాడు

సరికొత్త దారాలను వేసి
చొక్కాకు రంగులద్దాలని
తెగ తాపత్రయపడ్డాడు

ఎన్ని మార్చినా
అంగీలకు ఇసుమంతైనా
సోకు రాలేదు

ఆల్చిప్పలు అలసిపోయ
కన్నీటి సంద్రంలో
నల్లచుక్కలయనాయ
రొల్లుకున్న రాళ్లు దళారి జేబు చేరాయ
నిండుకున్న గినె్న వెక్కిరించింది

మార్వాడి మాట పొల్లుజారి
కుండపెంకు పగిలింది
క్రిమిని తాకలేని మందు
గొంతులోకి జారింది

అవనిని ఆదుకోలేని
ఆకాశం అన్నదాతను చూసి
కన్నీటి చుక్క రాల్చని
దొంగ ఏడుపు ఏడ్చింది

కాల్షియం చాలక విరిగే
వెనె్నముకలు ప్రశ్నిస్తున్నాయ
అస్థిపంజరాలకు అంగీ
తొడిగే రోజు అసలుందా అని!

- శింగరాజు శ్రీనివాసరావు, 9052048706