Others

గుహలో చైనీయుల కాపురం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనావాళ్లంటే అసామాన్యలు. భూమ్యాకాశాలలో తిరుగులేని పరిశోధకులు వీళ్లు! ఈ వారంలో వాళ్లు ప్రపంచం మొత్తంమీద అతి పెద్దదయిన రేడియో టెలిస్కోపుని అంతరిక్షంలోకి ఎక్కించారు గానీ ఇంకా అక్కడ ఆ దేశంలో సుమారు మూడు కోట్లమంది కొండ గుహలలో కాపురం వుంటున్నారు. ‘ఆదిమానవుడు’ క్రూర మృగాల ను మచ్చిక చేసుకుని కొండ గుహల్ని, చెట్టు తొర్రల్నీ ఆకమించుకున్నాడని విన్నామే గానీ యిలా, 21వ శతాబ్దంలో కూడా గుహలలో జీవించడం, సరదానో సాహసమోగానీ, నిజంగానే మూడు కోట్లమంది యోవోడొంగ్‌లు అంటే కొండగుహవాసులు అని అర్థం- ఇం చక్క గుహలలోనే గృహ సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నారు.
ఎక్కువగా రుూ గుహ జాతులవారు ‘షక్సీ’ రాష్ట్రంలో వుంటారు. ఒకప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా బహిష్కృతుడైనప్పుడు రుూ షక్సీ గుహలోనే తల దాచుకున్నాడుట. ఇవాళ రుూ ప్రాంతం
గుహలలో టెలిఫోన్, టెలివిజన్ సదుపాయాలు కూడా వున్నాయి.
రెండు గదుల, మూడు గుహలు నెలకో 30 డాలర్లు యిస్తే దొరుకుతాయి. 46వేల నుంచి రుూ యాభై వేల డాలర్లదాకా పెట్టగల స్తోమ త వుంటే ఒక గృహాన్ని (గుహని) సొంతం చేసుకోవచ్చును. సీనియర్ సిటిజన్లు ప్రశాంతత కోసం రుూ గుహలలోకి వెళ్లి నివశిస్తూ వుంటారుట!
ఇదిలావుండగా దక్షిణ ఆస్ట్రేలియాలో భూగర్భస్థ గృహాలు నిర్మించుకుని- ఒకరకమైన ‘పాతాళ లోకం’లో యించక్కా గడుపుతున్నారు మరికొందరు. ‘కూబర్ పెడీ’ అనే ఆస్ట్రేలియన్ నగరం భూగర్భంలో వుంటుంది. ఈ అండర్‌గ్రౌండ్ గృహాలని డగ్ అవుట్స్ (గోతుల్లో ఇండ్లు) అంటారు. దేశ దేశాలకి చెందినవాళ్లు 35 వేలమంది దాకా రుూ పాతాళగృహాలలో ‘బయటి వేడికీ, గోలకీ తాళలేకపోతున్నామంటూ’ హాయిగా వుంటున్నారుట. వీళ్లకి షాపులు, చర్చిలు, ఆర్టు గ్యాలరీలూ కూడా అండర్‌గ్రౌండ్స్‌లోనే వుంటాయి. చిత్రం గదా మనిషి కోరిక!