Others

జ్ఞానపు వెలుగు కోసం దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటిని చీల్చే ప్రతి దీపం
మనలోని అజ్ఞానాన్ని తొలగించి
తొవ్వ చూపిస్తుంది

అహంకారపు పొరల్లో
కూరుకుని మానవత్వాన్ని పాతరేసినప్పుడు
మనిషిననే స్పృహని మేలుకొల్పే
దివ్వెలు, అడుగడుగునా

శబ్దంలోని నిశ్శబ్దాన్ని గుర్తించి
ఒంటరితనం కాదు సమూహమే మనల్ని
ఒక్కటిగా చేసే వెనె్నల మడుగులు

ఎవరికివారే యమునాతీరేలాంటి నేటి కాలంలోని
కుటుంబాల కళ్లలో వెలుగులు నింపే
ఆప్యాయజ్యోతులు

దీపావళి ఒక సంబరం
పుట్టింటి నోముల జాతరలో
కలుసుకున్న బంధాలు
పెనవేసుకున్న మమతలు

చిచ్చుబుడ్లు, కాకరొత్తులు
అవ్వాయి, సువ్వాయిలు
అల్లుళ్ళ సరదాలు
అమ్మాయిల అలకలు
పిల్లల బొమ్మల కొలువులు,
తీపి మిఠాయిలు
వీటినన్నిటిని మోస్తూ వెలుగుల పండుగ
ప్రతి సంవత్సరం మనల్ని పలకరిస్తూనే ఉంది

ఒకప్పటి వైభవము కాలుష్యంలో
కొట్టుకుపోయినా
పండుగలు తమ అస్తిత్వం కోసం
పోరాటం చేస్తున్నాయి
అయినా కూడా
ప్రతీ దీపం మనిషిని జ్ఞానపు వాకిట
ముత్యమై నిలుపుతుంది

-పుష్యమీ సాగర్ 90103 50317