Others

యాంటీ ఆక్సిడెంట్లు అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ఇవి చాలా మేలుచేస్తాయి. మన శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఉంటే కాన్సర్, గుండెజబ్బులు వంటి రోగాలు దరిచేరవు. మరి శరీరంలో వీటి శాతాన్ని పెంచాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఏ ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందామా!

* ఆపిల్, నిమ్మ, నల్లద్రాక్ష, క్యారెట్ వంటివాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికే కాకుండా చర్మానికీ చాలా మేలు చేస్తాయి.

*తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముదురువర్ణంలో ఉండే తేనెలో అయితే పాలీఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా చాలా మేలు చేస్తుంది.

* సంపూర్ణ ఆహారమైన గుడ్డులో కేవలం మాంసకృత్తులే కాదు.. ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది.

* పెరుగు తినడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. రోజూ ఓ కప్పు పెరుగును తినడం వల్ల శరీరానికి అవసరమైన రైబోఫ్లేవిన్

అందుతుంది. రైబోఫ్లేవిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ కానప్పటికీ ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు ఇది సహాయం చేస్తుంది. అంతేకాదు ఇది నీటిలో సులభంగా కరిగిపోతుంది కాబట్టి తరచూ పెరుగుతింటే చాలా మంచిది.
ఇలా ప్రతిరోజూ మాంసకృత్తులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారపదార్థాలను తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి రోగాలేవీ దరిచేరకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉంటారు.