Others

మహాశిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కొండ బండరాళ్ళ వెంట నీ వులిని చేతబట్టి
పరుగు పరుగునా సాగిపోతూవున్న ఓ మహనీయ,
మహోన్నత శిల్పకళా ద్రష్టా! సృష్టికర్తా!
నీ పయనము ఎచటికి? నీ కోపము ఎవరిమీద?
కాస్త ఆగవయ్యా, మహానుభావా!
నేను అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పి వెళ్ళవయ్యా,
నీవు చెక్కిన ఆ మనోజ్ఞ రసదీపికా సుమబాలికా మూర్తి అయిన
ఆ స్ర్తి మూర్తి కన్నులలో ఉయ్యాలలూగుచున్న
ఆ నీలి కలువల సొబగులను ఏ అమృతభాండములో
నీ ఉలిని ముంచి చెక్కితివో చెప్పగలవా?
కదలలేని, కనులు తెరచి చూడలేని పెదవులు విప్పి
పలుకలేని ఆ బండరాళ్ళ వద్దకు నీవే వెళ్ళి ఎన్నో
నవరసాల సామ్రాజ్య వల్లరీ ఝరులను చెక్కిన నీ చేతులు
ఎంత అలసిపోయినవో? ఎనె్నన్ని రుధిరాల సెలయేరులలో
దొర్లి పొర్లినవో? నీ శరీరములో ఎన్ని నరాలు తెగిపోయినవో
చెప్పగలవా? శిల్పీ! ఆలయ శిఖరాగ్రము నుండి ప్రవేశద్వారం
వరకు రమణీయ శిల్పాలను చెక్కిన నీ హస్త కళా నైపుణ్యమును
కొనియాడతరమా! లేదు, దానికి కొలబద్ద లేదు శిల్పీ!
నిన్ను గుర్తించలేదని, బాధపడకు శిల్పీ!
నీవు ధన్యుడవు. గుళ్ళల్లో రూపంలేని పరమాత్మకు నీవు
కల్పించిన అత్యద్భుతమైన రూపం పూజలు, అభిషేకాలు,
కుంకుమార్చనలు, సహస్ర శతనామావళులు, పూర్ణ కుంభాభిషేకాలతో
విరాజిల్లుతూ, భక్తులను ఆనందింపచేస్తూండడం నీ చాతుర్యమే కదా!
రాముని పాదాలపై వాలిన శబరి నదీమతల్లిగా మారి పరుగులు తీసినట్లు
నీ చేతి ఉలి అంచులు తగిలిన రాయి అద్భుత
శిల్పకళాకృతులుగా మారిపోవాల్సిందే కదా!
ఎప్పుడో ఒకప్పుడు నీకూ వస్తుంది మంచికాలం
ఆ సువర్ణకాలం తొందరలోనే రావాలని ఆశిస్తున్నాను.

-కె.జి. దేవి అనంతపురం -- 9440230401