Others

అతడు(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు. హీరో మహేష్‌బాబు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే సినిమా. 2005లో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాకు ఓ హిట్టు ఫార్ములా ఉంటుందని చెప్పుకుంటే -అది కచ్చితంగా ‘అతడు’ స్క్రీన్‌ప్లే గ్రాఫ్‌లోనే ఉండాలి. మూడక్షరాల పొడిమాట ‘అతడు’ని టైటిల్ చేసి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరపై చూపించిన అద్భుతమే ఆ సినిమా. మోడ్రన్ సినిమా ఎరాలో పరిశ్రమలోకి అడుగుపెట్టే కొత్త దర్శకులు, వర్థమాన దర్శకులకు ఓ పెద్ద బాలశిక్ష -అతడు. అటికపాముల వూళ్లో లోకల్ రౌడీ వంక సూరిని కాల్చిన ఓ కుర్రాడు (నందు, మహేష్) హైదరాబాద్ పారిపోతాడు. తనను చేరదీసిన గ్యాంగ్‌స్టర్ సాధు, అక్కడే కలిసిన మరో అనాథ కుర్రాడు మల్లి, మరికొందరితో ఓ బ్యాంకు రోబరీలో పాల్గొంటాడు. సాధు గ్యాంగ్‌లోని కీలక వ్యక్తి డబ్బుకు కక్తుర్తిపడి పోలీసులతో చేతులు కలిపడంతో దొరికిపోతారు. ఆ టైంలో షార్ప్‌గా ఆలోచించిన నందు -షార్ట్ సర్క్యూట్‌తో ఠాణాలో విధ్వంసం సృష్టించి తప్పించుకుంటారు. ఇలా యాక్షన్ ఎపిసోడ్‌తో మొదలైన సినిమాలో -నందు, మల్లి షార్ప్ షూటర్లుగా స్థిరపడటం, కిరాయి షూటర్లుగా మారడం జరుగుతుంది. అలా తన ప్రొఫెషనల్ క్రైం కెరీర్‌లో ప్రతిపక్ష నేత మర్డర్ కేసులో ఇరుక్కున్న నందు, అక్కడి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో పార్థు మరణానికి కారణమవుతాడు. తనకు గురిపెట్టిన పోలీస్ బుల్లెట్ పార్థుకు తగలడంతో అతను చచ్చిపోతాడు. పనె్నండేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయిన పార్థు, ఇప్పుడు ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరుగుతుంది. ఇక్కడి నుంచి కథ మరో ట్రాక్‌లోకి వెళ్తుంది. పార్థు పేరుతో బాసర్లపూడిలోని వాళ్లింటికి నందు వెళ్లడం, అక్కడ ఫ్యామిలీ డ్రామా, సిబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ ఇన్విస్టిగేషన్, నందు ఎవరన్నది బయటపడటం, అప్పటికే పార్థు మరదలు నందుని పార్థుగా భావించి లవ్‌లో పడటం... టైట్ స్క్రీన్‌ప్లేతో స్టోరీ నడుస్తుంది. చివరికి నందు ఏమయ్యాడు, అసలు పొలిటీషియన్‌ను మర్డర్ చేసిందెవరు? అన్న మిస్టరీ రివీల్ కావడంతో సినిమా ముగుస్తుంది. హాలీవుడ్ చిత్రాన్ని తెలుగు నేటివిటీగా తగ్గట్టుగా మలిచారా? అన్నంత ఆసక్తికరంగా సాగుతుంది చిత్రం. మహేష్ కెరీర్‌కు ఓ హిట్టు చిత్రంగా నిలిచిన అతడు -నాకు చాలా ఇష్టమైన సినిమా.

-చిరతపూడి శ్రీనివాస్, నర్సాపురం