Others

గుడ్డి భార్య కోసం పూల వనానే్న సృష్టించాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధాప్యంలోనే భార్యభర్తల బంధం విలువ తెలుస్తుందని పెద్దలు అంటారు. ఒకరికొకరు తోడుగా ఉండే ఈ వయసులో ఒకరి ఆనందానికి మరొకరు చేయూతనిస్తారు. జపాన్‌లోని ఈ వృద్ధ జంట ఇందుకు నిదర్శనం. కురోకి జంటకు 1956లో వివాహమైంది. ముప్పయేళ్లు దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడిపారు. మధుమేహాం వల్ల భార్యకు 52 సంవత్సరాలు రాగానే చూపు మందగించి నడవలేక, పనిచేసుకోలేక పోతుంది. మనిషికి అన్ని అవయవాలు బాగుంటేనే అందరూ వచ్చి పలుకరిస్తారు కదా! గుడ్డిదైన కురోకి వద్దకు బంధువులు, స్నేహితులు రావటం మానేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఏదో పోగొట్టుకున్నట్లు విచారంగా ఓ మూలన కూర్చోవటం గమనించిన భర్త ఆమె ముఖంలో మళ్లీ ఆనందఛాయలు తీసుకురావటం కోసం అందమైన పూల వనాన్ని సృష్టించాడు. రెండేళ్ల పాటు కష్టపడి శిబాజాకురా అనే పింక్ కలర్ పూల తోటను పెంచాడు. ఇంటి ఆవరణ చుట్టూ పింక్ కలర్ పూలతోట కనువిందు చేస్తుండటం, ఈ పూదోటను చూసేందుకు బంధువులు, స్నేహితులు ప్రతిరోజూ రావటం ప్రారంభించారు. ఆ తోటలో బెంచ్ ఏర్పాటుచేసి భార్యను కూర్చోబెట్టేవాడు. ఆ తోట అందాన్ని చూడటానికి ఆమెకు కళ్లు లేకపోయినా చూసేందుకు వచ్చేవారంతా ఆమెతో మాట్లాడుతూ ఆ తోటను వర్ణించి చెబుతుంటే ఆ వృద్ధురాలి ముఖంలో తిరిగి ఆనంద ఛాయలు వెల్లివిరిశాయి. ముదిమి వయసులో భార్య కోసం భర్త చేస్తున్న ఈ పనిని పలువురు వేనోళ్లు పొగుడుతున్నారు.