Others

‘మోదీపై వ్యతిరేకత’ ఫలిస్తుందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని అనడం ఎం త సత్యమో, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవిని చేపట్టడం అంత సత్యం’- అని ‘కమల దళం’లో వా దించేవారూ ఉన్నారు. ఇటీవల కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఓటమిని చవిచూసినంత మాత్రాన మోదీ హవా పూర్తిగా కొడిగట్టలేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికల ఫలితాలను కొలమానంగా తీసుకోనవసరం లేదని భాజపా నాయకులు ఎప్పటిలాగే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపై నడవడం కష్టం గనుక భాజపాకు ‘అధికారం కోల్పేయంత’ నష్టం ఉండదని వారు అంచనా వేస్తున్నారు. ఇక, జాతీయ స్థాయిలో విపక్ష కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్న చంద్రబాబును మమతా బెనర్జీ, మాయావతి వంటి నేతలు నిజంగా నమ్ముతారా? ఏపీలో లోక్‌సభ సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో గతంలో మాదరి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి లేదంటున్నారు. ప్రధాని పీఠంపై కనే్నసిన మాయావతి, మమత వంటి నేతలు చంద్రబాబుకు సహకరిస్తారా? రాహుల్, చంద్రబాబు చేసే కసరత్తుకు వీరు మద్దతు ఇస్తారా? తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలకు తిలోదకాలిచ్చి, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబును జనం విశ్వసిస్తారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌డీఏ కూటమి నుంచి చంద్రబాబు తప్పుకోవడం, మోదీని బాహాటంగా వ్యతిరేకించడం చారిత్రక తప్పిదం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోదీతో కొనసాగిఉంటే ఏపీకి ఎంతోకొంత న్యాయం జరిగేదని కొందరు వాదిస్తున్నారు.
వచ్చే నెలలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను, వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోను ‘రెడ్డి’ సామాజిక వర్గం సత్తా చాటుతుందనే వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, విజయవాడ ఎంపీగా పనిచేసి కొన్నాళ్లుగా అస్త్ర సన్యాసం చేసిన లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అవకాశం వస్తే తాను తెలంగాణ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజగోపాల్ చెప్పడం ఆషామాషీ కాదని పరిశీలకులు అంటున్నారు. పారిశ్రామికవేత్తగా, రాజకీయ నేతగా రాణించిన లగడపాటి ఇప్పటికే దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి తనదైన శైలిలో సర్వేలు చేయించి రాబోయే ఫలితాల జాబితా తన దగ్గర పెట్టుకున్నారు. 2019లో మారబోతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుండి లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. సీమాంధ్రుల ప్రాబల్యం ఉన్నందున మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే అని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు, ఓటర్ల ఆలోచనలు లగడపాటికి అనుకూలంగా ఉన్నాయట!
***
అయోధ్య రామమందిర నిర్మాణోద్యమానికి 130 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని ఒక గుడి కట్టటం- ఒక గుడి కూల్చటం అని అర్థం చేసుకోకూడదు. భారతదేశం భారతీయులదా? లేక విదేశీ ఆక్రమణదారులదా? అనే వౌలిక సూత్రం ఈ రామమందిర ఉద్యమం వెనుక ఉంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరయూ నదీ తీరంలో అత్యున్నతమైన శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ఆర్డినెన్సు రావచ్చుననే ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి.
***
మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉంది. ఇన్నాళ్లు ఒకే పార్టీ పాలిస్తున్నందున ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక భావన రావటం సహజం. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నది. ఇక్కడ కాంగ్రెస్‌లో దిగ్విజయ్ సింగ్ ముఠా, కమల్‌నాథ్ ముఠా, జ్యోతిరాదిత్య సింధియా ముఠాలు కొట్టుకుంటున్నాయి. పార్టీ టికెట్లు తమ తమ వర్గాలకే రావాలని ‘లొల్లి’ మొదలుపెట్టి బాహాబాహీకి దిగారు. ఇది సొంత నాయకులే కాంగ్రెస్‌ను బలహీనపరిచే అంశం. మరోవైపు తెలంగాణలోనూ వివిధ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. టిక్కెట్లు రానివారు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి పార్టీ వదిలిపెట్టారు. మూడు దశాబ్దాలుగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వంటి సంస్థలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది ఆయన ఆలోచన. ఎన్నికలలో పోటీచేయడానికి తగిన ఆర్థిక స్తోమత ఉందా? అని తనను పార్టీ నాయకత్వం ప్రశ్నించిందని బుచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భాజపాను వీడినా, జాతీయవాద సిద్ధాంతాలకు అలవాటుపడిన ఈయన కాంగ్రెస్ సంకర సంస్కృతిని ఎలా జీర్ణించుకోగలడు?
***
జమ్మూ కశ్మీరులో అనిల్, రజిత్ సోదరులను జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ సోదరులు రాష్ట్ర బిజెపిలో కీలక నాయకులు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనిల్‌ను పాకిస్తానీ జిహాదీలు కాల్చిచంపడం ద్వారా కశ్మీరులోని జాతీయవాదులకు సవాలు విసిరారు. జాతీయవాదులను ఉగ్రవాదులు హతమార్చటం కశ్మీరులో ఇదేమీ మొదటి సంఘటన కాదు. 1950లో శ్యాంప్రసాద్ ముఖర్జీ హత్యా కాలం నుండి ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంది. అయినా ఉగ్రవాదులను అణచివేయడంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయటం, ఆక్రమిత కశ్మీరుకు విముక్తి కల్పించటం, జిహాదీ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సహాయంతో అంతమొందించటం చేయకుండానే కశ్మీరు సమస్యకు ఎలా పరిష్కారం లభిస్తుంది? లక్షలాది కశ్మీరీ పండిట్లు ఢిల్లీ వీధుల్లో కాందిశీకులై పడి ఉన్నారు. కశ్మీర్‌లోని కాంగ్రెస్, కమ్యూనిస్టు, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నాయకులకు కనీస మానవత్వం, జాలి లేకుండా పోయాయి.
***
పరిపూర్ణానంద స్వామి వద్దకు ఇటీవల చాలామంది భక్తులు వెళ్లి కలిశారు. ఆయన భాజపాలో చేరడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ‘స్వామీ! మీరు బురదలోకి దిగారేమిటి?’’అని కొందరు ప్రశ్నించారు. ఆయన చిరునవ్వుతో- ‘బురద నుండే కదా కమలం వికసించేది’ అన్నారు. ‘్భజపాలో చేరిన తమరు ఎక్కడినుండి పోటీ చేస్తున్నారు?’ అని ప్రశ్నించగా- ‘ఒక నియోజకవర్గానికి పరిమితమైతే అందరి విజయావకాశాలకు తోడ్పడే సమయం ఉండదు. తెలంగాణలో భాజపాకు కనీసం 70 సీట్లలో విజయం సాధించి పెట్టడం నా లక్ష్యం. అందుకోసం రోజుకు 17 గంటలు పనిచేస్తాను’ అన్నారు స్వామీజీ. అన్ని సీట్లు బీజేపీకి రావటం అసంభవం, ఐనా ఆ పార్టీకి నష్టం లేదు. స్వామీజీ చేస్తున్న కృషి ఫలిస్తే- 2019 లోక్‌సభ ఎన్నికలలో భాజపా పరిస్థితి మెరుగు పడవచ్చు. పరిపూర్ణానందస్వామి చాలా నిరాడంబరంగా జీవిస్తున్నారు. కట్టకునేందుకు ఒక పంచె, పైన వేసుకునేందుకు మరో గుడ్డ- ఇదే ఆయన స్థిరాస్థి- చరాస్థి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ ఎదిగినట్లే భవిష్యత్తులో ఈయన దక్షిణాది రాష్ట్రాల్లో ‘కాషాయ ధ్వజం’ ఎగరవేస్తారా?
***
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చంద్రబాబు, రాహుల్ కలయికకు మనస్తాపం చెంది కాంగ్రెస్‌ను తాను వీడుతున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా తమ పార్టీని తెలుగుదేశం వారు అణచివేస్తూ వచ్చారని, అలాంటి పార్టీ అధినేత చంద్రబాబుతో రాహుల్ ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఏమిటి? అని వసంతకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్, తెదేపాల మధ్య భావసారూప్యం ఏమిటి అని ప్రశ్నించారు. వసంతకుమార్ కాంగ్రెసులో ఆలోచిస్తున్నట్లే పెద్ద సంఖ్యలో టిడిపిలో కూడా నాయకులు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. ఇది అపవిత్ర కలయిక, అసంబద్ధ కూటమి అని కొందరు భావిస్తున్నారు. వసంతకుమార్ దారిలోనే సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, పసుపులేటి బాలరాజు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఒక రాష్ట్రానికి పరిమితమైన చంద్రబాబును నమ్మితే కేంద్రంలో అధికారం ఎలా దక్కుతుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
***
వరంగల్‌లోని పోచమ్మ మైదానం వద్ద సాయిబాబా దేవాలయం ఉంది. ఇందులో సత్యనారాయణ శర్మ అనే అర్చకుడు చాలాకాలంగా పూజలు నిర్వహిస్తున్నాడు. ఈయన కొద్దిరోజుల క్రితం మరో మతస్థుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సత్యనారాయణ శర్మ ప్రతి రోజూ ఉదయం సుప్రభాత సేవలో భాగంగా ఆలయంలో మైక్ పెట్టేవాడు. మైక్ శబ్దం వల్ల ఇబ్బందిగా ఉందని సాదిక్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రతిఘటించినట్లు పోలీసువర్గాల కథనం. మతపరమైన కోణంలోనే ఇతనిని హత్య చేశారని కొందరు నేతలు ఆరోపించారు. ముస్లింల సంతుష్టీకరణ వల్ల తెలంగాణలో హిందువులకు రక్షణ లేకుండాపోయిందని పరిపూర్ణానందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోకూడదు. ఐతే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మజ్లిస్‌తో తెరాస పార్టీ, అర్బన్- రూరల్ మావోయిస్టులతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకున్నాయని ఆయన విమర్శించారు. షిర్డీ సాయిబాబా హిందూ-ముస్లింల సమైక్యతకు సంకేతం. ఆయన ముస్లిం ఫకీర్. హిందూ ఆలయంలో పూజారి బ్రాహ్మణుడు. అలాంటప్పుడు ఓ ముస్లిం వ్యక్తి విచక్షణ కోల్పోయి ఆలయ పూజారిపై దాడి చేయటం సమంజసమేనా? అని జాతీయతావాదులు ఆవేదన చెందుతున్నారు.

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్