Others

ఉషాకిరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రభాత వేళ
పక్షులు తమ కిలకిలారావాలతో
స్వరహారతి పడుతుంటే..
మంచు తెరలను దాటి
వడివడిగా..
ధరణిని ముద్దాడే
లేలేత ఉషాకిరణాలతో
జగమంతా పులకరింత!

మేలిమి ముత్యాలను
తలపిస్తూ..
హిమబిందువుల
దుప్పటి లోంచి..
అప్పుడే ఒళ్లు విరిచి
కళ్లు తెరుస్తూ..
నవ్వులు పంచే సుమాలపై
సుతారంగా..
భానుడు చేసే సంతకంతో
ప్రకృతి మాతకు గిలిగింత!
మూతి ముడిచి
అలకబూనిన
పొద్దు తిరుగుడు పువ్వులకు
ఆదిత్యుని
ఆత్మీయ ఆలింగనంతోనే
ఒకింత సాంత్వనం!

రసరమ్యంగా
పరవశింపజేసే
రవికిరణ మృదుస్పర్శతోనే
కమల దరహాసం!!

-దాస్యం సేనాధిపతి 9440525544