Others

స్వర్గకామోయ జ్ఞేతయని శృతివాక్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No.7-8-51,Plot No.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500 079
=============================================================

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రములో కూడా మనము శ్రీమాతను మన శరీరంలోని ఏడు చక్రములలో శక్తిరూపంలో నివసించిన స్థితిని స్తుతిస్తున్నాము కదా.

శ్లో మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంధి విభేదిని
మణి పూరాంత రుదితా విష్ణుగ్రంధి విభేదిని

శ్లో ఆజ్ఞాచక్రాంతరాళస్థా, రుద్రగ్రంధి విభేదిని
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి

శ్లో విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణాత్రిలోచనా
శ్లో అనాహతాబ్ద నిలయా, శ్యామాభావదన ద్వయా
శ్లో స్వాధిష్టానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా
పై శ్లోకాలను 87వ నామమైన ‘పంచకూటైక తాపన్న కట్యధో భాగ ధారిణీ’తో సమన్వయము చేసుకుంటే శక్తి కూటమి యొక్క అవగాహన కొంత కలుగుతుంది.
1.వ్యాగ్భకూటము - సహస్రారము, ఆ-ఆజ్ఞాచక్రము వి-విశుద్ధ చక్రము
2.శక్తికూటమి - స్వా- స్వాధిష్టానము, మూ- మూలాధారము, మ-మణిపూరకము
3.కామరాజ కూటము - ఆ-అనాహతము
పంచదశి మంత్రములోని మూడవ కూటమైన ‘సకల హ్రీం’ అనే అక్షర సముదాయాన్ని శక్తి కూటమి అంటారు. ఇది శ్రీమాత యొక్క కటి భాగము నుండి క్రింది ప్రదేశమును సూచిస్తుంది. ఇచ్చట సృజనాత్మక శక్తులుండుటచే శక్తికూటమంటున్నాము. షట్చక్రాలు, సహస్రారముతో కలిసి మొత్తం 7 చక్రాలను పై పటములో చూపిన విధంగా రెండు రెండు త్రిభుజాలు మధ్య కేంద్ర బిందువులాగా సమన్వయిస్తారు.
సమన్వయము: సహస్రార, ఆజ్ఞ, విశుద్ధి చక్రముతో కలిసి, పైకి ఊర్థ్వ త్రికోణాన్ని ఊర్థ్వత్రికం అని అంటారు. మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార చక్రముతో, క్రిందికి శీర్షం ఉండే త్రికోణాన్ని ‘అధోత్రికం’ అని అంటారు. ఈ రెండు త్రిభుజాలకు ఆధారభూతముగా మధ్యన ఉండే బిందువును ‘అనాహత చక్రము’గా సమన్వయించుకుంటే ఊర్థ్వత్రికం వాగ్భవకూటాన్ని అధోత్రికం శక్తి కూటముగా, మధ్యనున్న (ఆధారబిందువును) అనాహత చక్రమును ‘కామ రాజ కూటము’ గాను శాస్తమ్రు సూచిస్తోంది. అణువులో కూడా మూడు భాగములున్నవి. అవి ప్రొటాన్స్, ఎలెక్ట్రాన్స్, న్యూట్రాన్స్. వీటినే ధనాత్మక (పాజిటివ్) ఋణాత్మక (నెగెటివ్), మూడవది సాధారణము (న్యూట్రల్) అని నవీన శాస్త్ర విజ్ఞానము చెబుతోంది. ఈ మూడింటినే మన ప్రాచీన సనాతన విజ్ఞానము, సత్వగుణము (బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియమ్) రజోగుణము (ఆక్టివిటీ) తమోగుణము (ఇనెర్ట్ ఆఫ్ స్టాటిక్) అని పేర్కొన్నది. ఈ మూడు గణములు అన్ని లోకములయందున్నవి. ఈ లోకములనే ఊర్థ్వ, అథో లోకములుగా చెప్పారు. వీటినే ఈ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పారు.
ఊర్థ్వలోకములు
1.సత్యలోకము 2.తపోలోకము 3.జనోలోకము 4.మహర్లోకము 5.సువర్లోకము 6.్భవర్లోకము 7.్భలోకము.
అథోలోకములు
ఈ అథోలోకాలనే ‘పాతాళము’ అని కూడా అంటారు. దీనిలో అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల మరియు పాతాళములు చేరియున్నవి. ఊర్థ్వలోకములలో భూలోక, భువర్లోక, సువర్లోకములు కృతకములు అనగా చేయబడినవి. ఇవి ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైనున్న మహర్లోకము సగము నశించి, సగము నిలిచి ఉండును. ఆపైనున్న జనోలోక, తపోలోక, సత్యలోకములు నశింపక, నిలిచి ఉండును. ఇవి చతుర్ముఖ బ్రహ్మ ఉండువరకు ఉండి, ఆయనతోపాటే బ్రహ్మమునందు లయమగును. పై 14 లోకాలు కలిసి బ్రహ్మాండమనబడుతోంది. మనము నివసించే భూలోకము బ్రహ్మాండ మధ్యమందున్నది.
పై పదునాలుగు లోకములు మూడు వర్గములుగా విభజింపబడి వేదాంత శాస్త్ర గ్రంథములయందు వర్ణింపబడినవి. ఆ మూడు వర్గాలు స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు అని వ్యవహరింపబడుతున్నవి. స్వర్గలోకమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములు మరియు అండభిత్తి బ్రహ్మాండమును చుట్టిన గోడ వరకు, మర్త్యలోకమనగా మధ్యనున్న భూలోక, భువర్లోకములు, భూలోకములోని భాగమైన మహాభూమి కూడా మర్త్యలోకమని వ్యవహరింతురు. ఇక మూడవది అయిన పాతాళమనగా, అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములను ఏడు లోకములుగా చేరినదిగా వ్యవహరింపబడుతున్నది.
సువర్లోకము లేక స్వర్గలోకమనగా భువర్లోకమునకు పైననున్న లోకము. ఈ లోకములోనే ఏకాదశ అవాంతర్లోకములు కలవు. స్వర్గలోకమందు ఆరు మాసములు పగలుగాను ఆరుమాసములు రాత్రిగాను యుండును. స్వర్గలోకమందు దేవతలు నివసించెదరు. వారికి ముదిమియుండదు. వారికొకరోజు మనకొక సంవత్సరమగును. ఇందు దేవేంద్రాది దేవతలు నివసించు లోకమునకు దేవలోకమనియు, జ్యోతిష్టోమాది యజ్ఞకర్మలు తత్తుల్యమైన పుణ్యకర్మలనాచరించినవారికి లభించు లోకము స్వర్గలోకమనియు వేదములు చెప్పుచున్నవి. ‘స్వర్గకామోయ జ్ఞేతయని శృతివాక్యము. స్వర్గమును కోరువాడు యజ్ఞమును చేయుగాకయని యర్థము.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590