AADIVAVRAM - Others

అచ్చమైన ప్రేమలో కామం లేదు.. (రాస క్రీడాతత్త్వము-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి దృక్కోణం :-
రాజా! ‘‘్భగవంతుడైతే మాత్రం లోకధర్మాన్ని అతిక్రమించి నడవవచ్చా?’’ అని అడుగుతున్నావు. భగవంతుడైన శ్రీహరితో పోల్చి చూస్తే, కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతి, మొదలైనవారంతా అతి సామాన్యులు. అట్టివారు కూడా ఒక్కొక్కప్పుడు లోకహితం కోసం, లోకధర్మాన్ని అతిక్రమించడం కనిపిస్తూనే వున్నది. దానిని పెద్దలంతా హర్షిస్తూనే వున్నారు. ప్రజాపతులకే ఇటువంటి హక్కు వుంటే, భగవంతుడైన శ్రీహరికి వుండదా?
రెండవ దృక్కోణం :-
తపస్సనే తేజస్సు అఖండంగా ఉద్దీపిస్తూ వుండే తేజోవంతులై మహర్షులు, కొన్ని సందర్భాలలో తెలిసి కూడా తప్పులు చేస్తూ వుంటారు. కానీ, వారిలో వున్న తపోజ్వాల ముందు ఈ తప్పులన్నీ గరిక పరకలై, మాడి బూడిదవుతూ వుంటాయి. ఇది కూడా పెద్దలంగీకరించిన విషయమే. తపస్సు చేసే మునులకే ఇలాంటి శక్తి వుంటే, ఆ తపస్సులన్నిటికీ ఫలితాలనిచ్చే భగవానుడికి ఆ శక్తి వుండదా?
మూడవ దృక్కోణం :-
పెద్దలేం చేస్తే పిన్నలదే చేస్తారన్నావు. ఇది అన్ని చోట్లా కుదిరే మాటేనా? పరమేశ్వరుడు హాలాహాలం గుటుక్కున మింగాడు. లోకంలో ఇంకెవరైనా ఆయనను అనుకరించ గలరా? ఎవడైనా మూర్ఖుడు ఆ సాహసం చేస్తే, మాడి మసి కాకుండా వుంటాడా?
నాలుగవ దృక్కోణం :-
పెద్దలు చేసేవీ, చెప్పేవీ, రెండూ ఒకే రకంగా వుండాలనే మాట లోక సామాన్యమైన పెద్దలకు మాత్రమే వర్తిస్తుంది. లోకోత్తర ప్రభావ సంపన్నులైన మహానుభావులు క్రిందిస్థాయిలోవారికి కావలసిన ధర్మాలను హితోప దేశాలుగా అందిస్తూ ఉంటారు. వారు మాత్రం అదే క్రిందిస్థాయిలో నడువరు. కనుక, వాళ్ళు చేసేదానికన్నా చెప్పేది లోకానికి ముఖ్యం.
ఐదవ దృక్కోణం :-
సామాన్యులకు లేని హక్కు వారికెలా వచ్చిందంటావా? సామాన్యులంతా ‘‘నేను చేస్తున్నాను’’ అనే కర్తృత్వభావనతో, అహంకారంతో కూడిన పనులు చేస్తూ వుంటారు. అందువల్ల, వాళ్ళ సంకల్పాల వెనుక మంచిదో, చెడ్డదో, ఏదో ఒక కామం వుంటుంది. కామమూ, అహంకారమూ, వాళ్ళను ఎప్పటికప్పుడు క్రిందకు లాగుతూ వుంటాయి. మరి మహాత్ములకంటావా, కామమూ, అహంకారమూ మాత్రమే కాదు, సంకల్పం కూడా వుండదు. వారికి సొంత సంకల్పం వుండదు కనుక, వారి ద్వారా పనులు జరుగుతాయే తప్ప, వారు పనులు చేయరు. ఇది రహస్యం. అందువల్లే, అలాంటి మహాత్ములు ఒక్కొక్కప్పుడు ధర్మవిరుద్ధంగా నడిచినా, దాని ఫలితం వారికి అంటదు.
ఆరవ దృక్కోణం :-
ప్రతి మహాత్ముడూ ఇలా అకృత్యాలు చేస్తూ ఉండవలసిందేనా? - అని అడుగుతావేమో! ఇక్కడ ఒక గొప్ప రహస్యం వుంది. శరీరాన్ని స్వీకరించిన మహాత్ములకు ఒక్కొక్కప్పుడు కొన్ని దుష్ట ప్రారబ్ద కర్మలు మిగిలిపోయి వుంటాయి. కానీ, వారు అప్పటికే సంకల్పాలను జయించి వున్నారు కనుక, వారు ఏ పనులూ చేయరు. వారు ధరించిన శరీరానికి మాత్రం ఆ ప్రారబ్ధశేషం మిగిలి వుంటుంది. ఇలాంటి సందర్భాలలో పరమాత్మ ఆ శరీరాలకు వున్న ప్రారబ్ధాన్ని ఉపయోగించుకుని, ఆ హృదయాలలోకి ఒక సంకల్పాన్ని తనే ప్రవేశపెట్టి, తద్వారా వారి ప్రారబ్ధకర్మ క్షయాన్నీ, లోకులకు ఒక అపూర్వ ఉపకారాన్నీ, రెండింటినీ ఏకకాలంలో సాధిస్తాడు. పరమాత్మే స్వయంగా శరీరం ధరించేటప్పుడు ఇలాంటి పనులు జరగటంలో ఆశ్చర్యం ఏముంది?
ఏడవ దృక్కోణం :-
ఎవడు ‘నేను వేరు, నువ్వు వేరు’ అని అనుకుంటున్నాడో, వాడికి ఆడా మగా తేడాలున్నాయి. అందుకే, వాడికి కట్టుబాట్లున్నాయి, ధర్మాధర్మాలున్నాయి.

దీనికి భిన్నంగా ఎవడు సర్వజీవులలోనూ ఏకరూపంగా వ్యాపించి వున్నాడో, వాడికి పరులెవరు? పరస్ర్తిలెవరు? నీ స్థాయినిబట్టి నీవు ఆలోచిస్తూ, పరమాత్మకు కూడా అవే కొలమానాలు తగిలిస్తాననటం తగునా?
ఎనిమిదవ దృక్కోణం :-
భగవంతుడు కాముకుడై ప్రవర్తించాడని భావించి నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. నేను చెప్పింది భగవంతుడి కామకథ కాదు. అది ప్రేమకథ. కామమన్నా, ప్రేమన్నా ఒకటే అనుకుంటున్నావా? కాదు. తన ఇంద్రియాలకు తృప్తి కలగాలనే కోరిక పేరు కామం. ఇతరుల ఇంద్రియాలకు తృప్తి కలగాలనే కోరిక పేరు ప్రేమ. దీనే్న తిప్పి చెప్పితే, కామానికి కామించేవాడు ముఖ్యం. ప్రేమకు ప్రేమింపబడేవాడు ముఖ్యం. కృష్ణుడూ, గోపికలు, అనే ఈ సందర్భంలో గోపికలకు తమ ఇంద్రియ తృప్తిని గురించిన ఆలోచన అణువంత కూడా లేదు. తమ ఆలోచనలనూ, తమ శరీరాలనూ, తమ ధర్మాలనూ, తమ భవిష్యత్తునూ, అన్నిటినీ గూడా, శ్రీకృష్ణుడికి సమర్పించాలన్నది ఒక్కటే వారి తపన. ఇది అచ్చమైన ప్రేమ. దీనిలో కామానికి చోటే లేదు. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అయిన పరమాత్ముడు గనుక, ఆయనకు కామం వుండే అవకాశమే లేదు. జీవ్ఱుకే లేని కాముక ప్రవృత్తి పరమాత్మకు కలిగిందని చెప్పగలమా? కనుక, ఈ సన్నివేశంలో కామానికి ప్రసక్తే లేదు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060