Others

జాతీయ నిష్ఠను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యానికి, అధికారానికి, సృష్టిక్రమానికి ఆటంకం కలిగించాలని భావించిన సందర్భంలో మహాభారత యుద్ధం జరిగింది. మనకు 5,120 సంవత్సరాల ముందు ఆ యుద్ధం జరిగింది కాబట్టి అదే మనకు ఆదర్శం, మార్గదర్శనం, కనువిప్పుగా భావించవలసి ఉంది. వేరువేరు దేశాల నుండి వేరువేరు జాతుల వారు, వివిధ మతాల వారైన మ్లేచ్చులు, ఇస్లాంలు, క్రైస్తవుల దురాక్రమణతోను, మోసంతోను మన దేశాన్ని ఆక్రమించుకొని దాదాపు వేయి సంవత్సరాల కాలం పాలించిన కారణాన వారి పాలన చేష్టలే మన దేశ వాసులపై పడింది. ఆర్థిక దోపిడీ, అధికార కాంక్ష, విభజించి పాలించుట, హిందుత్వాన్ని అవహేళన చేయడం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న వారిని మతతత్వ వాదులుగా ముద్ర వేయడం.. ఇలాంటి వికృత చేష్టలన్నీ ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిస్టుల ద్వారా నేర్చుకొని హిందూ సమాజంపై దాడి చేయడమే ఈనాటి రాజకీయ పార్టీల, నాయకుల ఎజెండాగా మారిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నిజాం నిరంకుశత్వాన్ని తలపింపచేసింది. కాంగ్రెస్ నియంతృత్వ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి పటేల్, పట్వారీ వ్యవస్థను తొలగించి మండలాలను స్థాపించి పాలనను ప్రజలముందుకు తెచ్చారు. కాంగ్రెస్ వారసత్వం నుండి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్.టి.రామారావును వెన్నుపోటు పొడిచి.. ప్రభుత్వాన్ని, పార్టీని హస్తగతం చేసికొన్నాడు. వ్యవసాయాన్ని ఆదరించని చంద్రబాబు నాయుడు కరెంటు కావాలని అడిగిన రైతులను బషీర్‌బాగ్‌లో పోలీసుల తూటాలకు బలిచేసినాడు. రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చిన గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌కు పట్టం కడితే నిజాం పాలనను తలపింపచేస్తుందని ఆ పార్టీని కనుమరుగుచేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు జనం పట్టం కట్టారు. అయితే, రాష్ట్రాన్ని దోపిడీ చేసి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించకుండా నాలుగు సంవత్సరాల తరువాత- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న సాకుతో ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు దాడిచేయడం ప్రారంభించినాడు.
అర్బన్ నక్సలైట్లను ‘క్రాంతికారుల’ని ట్విట్టర్‌లో పేర్కొన్న జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతినుద్దేశించే ఓ రాజనీతిజ్ఞుడుగా చంద్రబాబు నాయుడుడి కనిపించినాడా- కాంగ్రెస్‌తో తెదేపా జతకట్టడానికి! అంటే చంద్రబాబు బిజెపియేతర కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే అది జాతిద్రోహుల కూటమి కాదా? అన్నది విజ్ఞుల ప్రశ్న.
ఏనాడూ ఒంటరి పోరాటం చేయని చంద్రబాబు అధికారం కోసం తెలుగు ప్రజలు ఛీకొట్టిన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం ద్వారా జనం ఆత్మాభిమానాలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టాడని భావించాలి. అధికారమే పరమావధిగా పెట్టుకున్న చంద్రబాబుకి 2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందేమో! 2019లో తెలుగుదేశం పార్టీకి బుద్ధిచెప్పటానికి తెలుగు ప్రజలు కంకణం కట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వైపుచూస్తూ- భాజపాకు పట్టం కట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
బిజెపియేతర కూటమి ఏర్పాటు చేయలని చంద్రబాబు కసరత్తు చేయడం ఏపీ ప్రజలను మోసం చేయడం తప్ప వేరొకటి కాదు. 1977లో ఎమర్జెన్సీ తరువాత వచ్చిన వివిధ పార్టీల కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వం 18 నెలలు మాత్రమే పరిపాలన చేయగలిగింది. థర్డ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ నేతలు పట్టుమని రెండు సంవత్సరాలు కూడా పరిపాలన చేయలేకపోయారు. మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామంటున్న విపక్షాల జెండాలు వేరు, అజెంజాలు వేరు, సిద్ధాంతాలు వేరు. విపక్షాల్లో ప్రతి పార్టీ నాయకుడికి ప్రధానమంత్రి కావాలనేదే కోరికతప్ప దేశ ప్రజల అభ్యున్నతిపై ఎలాంటి తపన లేదు. ప్రధానమంత్రి పీఠంపై ఎక్కించుడు, దించుడనే పావులాటలోనే తలమునకలయ్యే నాయకులకు దేశాన్ని పాలించే సమయమెక్కడిది?
భారతదేశ ప్రజలు ఇప్పటికే కూటములు, మహాకూటముల ప్రయోగాలను అనుభవించినవారు కాబట్టి ఇకముందు అలాంటి ప్రయత్నాలను నమ్మేవారు లేరు. స్వతంత్రంగా కొన్ని పార్లమెంటు సీట్లు కూడా గెలువలేని, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు ఏర్పాటుచేసే- ‘దేశాన్ని ముంచే కూటమి’కి, వెన్నుపోటుదారులకు జనం ఓట్లు వేయరనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా చేస్తున్న ప్రతి పని దేశ ప్రజల శ్రేయస్సుకనేది జగమెరిగిన వాస్తవం.
అక్రమాస్తులపై ఐటీ శాఖ దాడులు జరుపుతోంది. పలు రకాలుగా మోసం చేసి బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయినవారి ఆస్తులు ఏ దేశంలో ఉన్నా జప్తు చేయడం ఖాయం. భాజపా ప్రభుత్వం ప్రకటించే అన్ని సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ వర్తించే విధంగా ఉన్నాయి. కాని చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ప్రకటించే పథకాలు కులాల పరంగా, మతాల పరంగా ఉంటున్నాయి. వీరి బుజ్జగింపులు ఎంతోకాలం నిలువవు. ప్రతి కులం వారిని, ప్రతి మతం వారిని తమ వైపు తిప్పుకోవడానికే ఈ నైతల పాలనాకాలం ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అంతం చేయాలని బిజెపియేతర కూటమి నేతలు నానా తంటాలు పడుతున్నారు. అధికార దాహంతో రాష్టస్థ్రాయిలో సీట్లు సర్దుబాటుకు పొత్తులు పెట్టుకొంటున్నారంటే చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ అనుభవానికి పరాకాష్ఠ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి దేవాలయం ముందు దసరా పండుగ పర్వదినాన హిందూ స్ర్తిలు సాంప్రదాయబద్ధంగా, తమ సంస్కృతి ఉట్టిపడే విధంగా బతుకమ్మ ఆడితే- శాంతిభద్రతల పేరిట వారిని అరెస్టు చేయించడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన చరిత్ర.
కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్‌ఎస్ పాలన చవిచూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలోను, రాబోయే ఎన్నికలలోను భారతీయ జనతాపార్టీని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించాలనే ఆలోచనలో ఉన్నారు.

--బలుసా జగతయ్య 90004 43379