Others

అత్తాకోడళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తాకోడళ్లు..
కుటుంబ రథానికి రెండు చక్రాలు!
గృహ గగన సీమలో..
వెలుగుపంచే చుక్కలు!
అస్తిత్వాన్ని ప్రదర్శించడంలో..
ఇద్దరూ ఒకే తాను ముక్కలు!

అంతర్గతంగా
ఆధిపత్యం కోసం..
వారు పడే ఆరాటంలో
కొడుకులవుతారు
అడకత్తెరలో పోకచక్కలు!

దొందూ దొందే
అన్న చందం వోలే...
కోడిపందేలను
తలపించేలా..
మాటలతో-
కోలాటం ఆడుతుంటే...
పై చేయి
ఎవరిదైతేనేం?
ఇరువురినీ రెండు కళ్ళలా భావించే..
తనయులకు తప్పవు చిక్కులు!

అమ్మలా..
అత్త ప్రేమను పంచితే మాత్రం
కోడళ్ళు సైతం...
కూతుళ్ళను మరిపిస్తారే తప్ప..
చెయ్యరు ఏ జిమ్మిక్కులు!

-- దాస్యం సేనాధిపతి 94405 25544