Others

విచక్షణతో మెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తయారు చేసిన
ఓటింగ్ యంత్రంలో లేవు
మాయలు, మంత్రాలు, తంత్రాలు!
ఉన్నదంతా మని‘షి’ మనసులోనే.!!
పెద్ద సార్లు పెట్టినారు పెడబొబ్బలు
ఉన్నది ఓటింగ్ యంత్రంలో
గడబిడ ఏదోనని..

చివరికి తేల్చారు లోటు
ఓటింగ్ యంత్రంలో కాదని
ఉన్నదంత మన వారి నోటిలోనేనని!

నిరూపించారు నిక్కచ్చిగా శాస్తవ్రేత్తలు
ఓటింగ్ మిషన్ మీటనొక్కి..
రూఢీ చేశారు వేసిన ఓటు
పక్కాగా అదే గుర్తు మీద దిగిందని బల్లెంలా!

ఓటర్ల ముంగిట నిలిచింది ఈ మారు
అద్దంలా అదే మన ‘వివిపీఏటీ’గా..
సంబురమాయే ఓటరుకు
గుండెలనిండా వేసిన ఓటు సఫలవౌతుందని!
మీట నొక్కగానే కనిపిస్తుంది

మీ ఓటు అరక్షణంలో
కనుమరుగవుతుంది ఆ అరక్షణంలోనే
ఉండాలి అందరూ అప్రమత్తంగా
ఓటు వేసే సమయాన..

నాయకులారా! చాలించండి
మీ కపట నాటకాలను
గెలిచినపుడు బాగు బాగు
ఓటింగు మిషన్ పనితీరని..
ఓడినపుడు బాగలేదనుట భావ్యమా మీకు?
అంతా మానవ మాత్రులమేగా!

పట్టండి ఓటరు నాడీ
వివరించండి ఓటు నిర్ధారణ యంత్రం
విశేషాలను వివరంగా
ఓటర్లకు పల్లె పల్లెన..
తట్టండి ఓటర్ల గుండెల తలపులని
చూపండి ఓటు నిర్ధారణ యంత్రం
కిటిటీ ద్వారా మీ గుర్తుని

సాధించండి ఘనమైన
విజయాన్ని ప్రేమతో
పాలించండి ప్రజలను
సుఖశాంతులతో..!

-ఉషశ్రీ తాల్క