Others

కార్తీక దీపాలు.. ముక్తికి మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తులసి కోట ముందు
వెలుగు బావుటా!
కార్తీక దీపం!!
ఉసిరి చెట్టు చుట్టూ
మిణుగురుల ముచ్చట్లు
కార్తీకం కదూ!!
ఈ నెల్లాళ్లపాటు
చలీ లేదూ గిలీ లేదూ
దీపాల వలయముందిగా!
చీకటి మాటుని
చీలుస్తున్న విచ్చుకత్తి
ప్రమిదలో వెలుగొందే వత్తి!
నీ చేతలే నీకు రక్ష అంటూ
అరచేతుల్లోని దీపం !
పత్రం .. పుష్పం.. తోయం
ఈశ్వరపూజకి జత కల్సింది
దీపం వెలుగు పంచుతూ!!

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి