Others

అందమైన నవ్వు వైద్యుడిచ్చే వరం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింధటివారం అందవికారమైన నవ్వుకి కారణాలైన కొన్ని పంటి లోపాలు, వాటి చికిత్స గురించి చర్చించుకున్నాం. మిగతా లోపాలు వాటి చికిత్స గురించి ఇపుడు ప్రస్తావిస్తాను.
పంటిమధ్య సందులు
ఏ రెండు పళ్ల మధ్యన సందు ఉండకూడదు. ఆ సందు బాగా ఇరుకుగా గనక ఉంటే అక్కడ మనం తినే తిండి పదార్థాలు ఇరుక్కునే ప్రమాదం వుంది. ఈ ఇరుక్కున్న పదార్థాలు అంత తేలికగా రావు. ఒకరకమైన వేదనకు గురిచేస్తాయి. సాధారణంగా ఈ తరహా బాధితులు జేబులో కొన్ని పుల్లలు పెట్టుకుంటారు. తినడం అవ్వగానే ఆ పుల్లలతో ఇరుక్కున్న పదార్థాల్ని తీసే ప్రయత్నం చేస్తారు. నోటి దుర్వాసనా, పండ్లకి పుచ్చు కలగవచ్చు. కొందరిలో ఈ సందులు చాలా వెడల్పుగా వుంటాయి. వీరికి నవ్వాలంటేనే నామూషీ.
చికిత్స
ఈ సందులు పళ్లమధ్య 13/14 సంవత్సరాల వయసు వరకు ఉండడం సహజం. ఆ తరువాత ఉంటేనే సమస్య. ఈ సమస్యని 14 లేక 15 సంవత్సరాల వయసులో గనక గమనించగలిగితే, వైర్ల సహాయంతో ఈ సందులని మూసే ప్రయత్నం చేయవచ్చు. ఈ వైర్ల చికిత్స పూర్తి చేయడానికి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల సమయం పడుతుంది. వైర్లు చూడడానికి బాగా లేవు అనిపిస్తే నినిడజనిదితో చికిత్స చేసేందుకు అవకాశం వుంది. ఇది కొంచెం ఖరీదు ఎక్కువ. వైర్లకు పట్టినంత సమయమే దీనికి పడుతుంది. కాకపోతే ఇందులో వైర్ల బదులు ఓ ప్లాస్టిక్ పరికరాన్ని వాడతారు. చికిత్సా సమయంలో నోట్లో కనిపించే వైర్లు ఈ నినిడజనిదిలో కనిపించవు. ఆ ప్లాస్టిక్ పరికరం పారదర్శకంగా వుండడంవలన అది మన నోట్లో తొడుక్కున్నట్లు చాలామంది గమనించరు. ఈ వైర్లు పంటికి ముందు భాగంలో ఇంక పంటికి వెనుక భాగంలో కూడా వేస్తారు. పంటికి వెనుక భాగంలో వేసిన వైర్లు నవ్వినపుడు కనిపించవు, కాకపోతే ఈ విధానంలో జరిగే చికిత్సా సమయం ఎక్కువ. రెండోది ఖరీదు ఎక్కువే. మూడోది, కొన్నిసార్లు మనకి కావాల్సిన మార్పు గనక పళ్లలో రాకపోతే అపుడు వైర్లు పంటి ముందు భాగం నుంచి వేసి చికిత్స చేయవలసి వుంటుంది. ఈ చికిత్సలన్ని పెద్దవారిలో కూడా చేయవచ్చు.
చికిత్స త్వరగా అవ్వాలని కోరుకునే వారిలో (ముఖ్యంగా పెద్దవారిలో) కృత్రిమ పళ్లు తొడిగి చికిత్స చేయవలసి వుంటుంది. దీనికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. కొందరిలో వారం కూడా పట్టొచ్చు. చికిత్సకి ఉపయోగించే కృత్రిమ పళ్లు యన్గ్ళ్జిని పళ్లరుతే అవి చాలా సహజంగా, అందంగా కనిపిస్తాయి. వీటి ఖరీదు ఎక్కువైనా ముందుపళ్లకి నేను వీటినే సూచిస్తాను.
ఎగుడు దిగుడు పళ్లు
అందమైన నవ్వుని అంతం చేసే ఓ బలమైన ఆయుధం ఈ ఎగుడు దిగుడు పళ్లు. వీరిలో ఉండే మరో చిక్కు ఏంటంటే పళ్లు ఎగుడుదిగుడుగా ఉండడంవలన వీరు పళ్లు సరిగా తోమలేకపోతారు. అందుకే వీరి పళ్లు పసుపుపచ్చగా మారి, పంటిమీద పండ్లపాచి ఏర్పడుతుంది. దీనివల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. పై చెప్పిన విధంగా 13/14 ఏళ్ల వయసు వరకు ఈ ఎగుడు దిగుడు పళ్లు సహజం, ఆ తర్వాత కూడా ఉంటే వైర్ల చికిత్స లేక నినిడజనిదితో చికిత్స చేసి పళ్లని సరి చేసుకోవాల్సి వుంటుంది.
చికిత్స త్వరగా అవాలనుకునేవారిలో కొన్ని ఎత్తుపళ్లని తీసివేయడం, కొన్నింటిని రూట్‌కెనాల్ చికిత్స లాంటివి చేయడం చేసి ఆపై కృత్రిమ పళ్లు తొడగాల్సి వుంటుంది. పేషెంట్‌ని బట్టి చికిత్సా విధానం మారుతూ వుంటుంది.
పండ్ల పాచి
పంటిమీద లేక పంటికి చిగురుకి గల జంక్షన్ దగ్గర, పసుపుపచ్చగా లేక నల్లగా లేక గోధుమ రంగులో రాయిలా, పంటినించి పంటికి తీగలా అల్లుకున్నదానే్న పండ్లపాచి అంటారు. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అమితంగా వుంటుంది. నోటి దుర్వాసనకిది ప్రథమ కారణం. చాలా సందర్భాలలో ఈ పాచి చిగురు కిందకి చేరి చిగురులో మరియు పంటిని పట్టుకున్న ఎముకలో ఇన్‌ఫెక్షన్ కలిగించి, చిగుర్లు జారిపోడానికి ఎముక బలహీనమవ్వడానికి కారణం అవుతుంది. దీని మూలంగా గట్టిగా ఉండే పన్ను ఊగడం మొదలౌతుంది.
మనం తిన్న ఆహారం ఉమ్ముతో కలిసి పంటిమీద పాచిలా మారుతుంది. ఇదిఅందరిలోను ఉంటుంది. అందుకే ఏడాదికోసారి దంతవైద్యుడిని కలిసి పంటి క్లీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం. దీని వల్ల పళ్లు ముత్యాల్లా మెరుస్తుంటాయ.
పాచి చాలా ఎక్కువగా ఉన్నవారిలో, చిగుర్లు జారిపోయినవారిలో, చిన్న వయసులోనే పండ్లు ఊగుతున్నవారిలో ఎక్స్‌రే తీసి ఏ చికిత్స చెయ్యాలో నిర్ణయించుకోవాలి. పండ్ల పాచి కారణంగా నవ్వలేనివారు పంటి క్లీనింగ్ చేయించుకోవాల్సి వుంటుంది. చిగురులో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా గనక ఉంటే దానికి తగ్గ చికిత్స చేయించుకోవడం మంచిది.
ఈ వారం పంటి లోపాల గురించి చర్చించుకున్నాం, వచ్చేవారం చిగురు లోపాల గురించి చర్చించుకుందాం.
‘‘అందమైన నవ్వు దేవుడిచ్చిన వరం అని మా బామ్మ చెప్పేది. అందమైన నవ్వు దంతవైద్యుడిచ్చే వరం అని నేటి భామలు నమ్మేది’’.
**
-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com