Others

మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసును ఏకాగ్రం చేసి సాధన వైపు దృష్టిని ఎలా మరల్చాలో బాబా ఎంతో మృదుమధురంగా చెబుతున్నారు. ఆ పలుకుల్లోంచి స్రవిస్తున్న అమృతాన్ని గ్రోలుకుందామా!
‘‘మనస్సు సహజంగా చంచలమైనది. దానిని ఉద్రేకించేలా చేయరాదు. ఇంద్రియాలు చలింపవచ్చు. శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. దానిని సహనం కోల్పోయేలా చేయకూడదు. ఇంద్రియాలు విషయాలవైపు పరుగెత్తుతాయి. కాని మనం వాని వెంట పడకూడదు. మనం ఆ విషయాలను కోరకూడదు. క్రమంగా, నెమ్మదిగా సాధన చేయటంవల్ల చంచలత్వాన్ని జయించవచ్చు. ఇంద్రియాలకు మనం లోబడకూడదు. కాని వాటిని మనం పూర్తిగా స్వాధీనంలో ఉంచుకోలేం. సమయానుకూలంగా వాటిని అణచి సరిగా ఉంచుకోవాలి. మనకు కళ్లు అందమైన వాటిని చూడటంకోసమే ఇవ్వబడినవి. విషయాల సౌందర్యాన్ని నిర్భయంగా ఆ కళ్లతో చూడవచ్చు. అందుకు భయపడటానికి కానీ, సిగ్గు పడటానికి కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనసులో ఉంచుకోకూడదు. మనులో ఎటువంటి కోరిక లేకుండా భగవంతుని సుందరమైన సృష్టిని చూడాలి. ఈ విధంగా ఇంద్రియాలను సులభంగాను, సహజంగాను స్వాధీనం చేసుకోవచ్చును. విషయాలను అనుభవించటంలో కూడా మనం భగవంతుడిని గుర్తుంచుకోవాలి. బాహ్యేంద్రియాలను మాత్రం స్వాధీనంలో ఉంచుకుని మనసును విషయాల వైపు పరుగెత్తనిస్తే వాటిపై అభిమానం పోగొట్టుకోకుంటే చావు పుట్టుకల చక్రం నశించదు. ఇంద్రియ విషయాలు హానికరమైనవి. వివేకం (అనగా నిత్యనిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా,మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్టు సంచరింప చేయకూడదు. అపుడే విష్ణు పథాన్ని చేరగలం. అదే మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం. అదే మన నిజమైన ఆవాసం. అక్కడికి వెళ్తే ఇక తిరిగి రావటమంటూ ఉండదు.’’
మంచి కోసం ఏదో ప్రయత్నం చేయాలి...
అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల మనశ్శక్తి మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. అదే మనసును అదుపులో పెట్టుకోలేకపోవటం మనిషికి ఉన్న గొప్ప బలహీనత. ఈ బలహీనత నుంచే మనసులో ఎన్నో మనో వికారాలు కలుగుతుంటాయి. మనలోని బలహీనతలను అధిగమించటానికి మనం చేసే ఎలాంటి ప్రయత్నాలకైనా దేవుడు దగ్గరుండి సహకరిస్తాడు. మనసును అదుపులో ఉంచుకునే విషయంలో ఒక పామరుడైన భక్తుడు ఆచరించిన విధానం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
=================================================
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566