Others

భారతీయ మహిళల్లో ఆత్మహత్యలు ఎక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ వ్యవస్థ, సామాజిక పరిస్థితుల కారణంగా మన దేశంలో ఆత్మహత్య చేసుకొనే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ‘లానె్సట్ పబ్లిక్ హెల్త్’ తాజా సంచికలో మహిళల ఆత్మహత్యలకు సంబంధించి ప్రచురించిన విశే్లషణ ఈ వాస్తవాలను వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళల్లో మూడవ వంతు భారతీయులేనని పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న మహిళల్లో 36 శాతం మంది భారతీయ స్ర్తిలే కావడం ఆందోళనకర పరిణామం. ఆర్థిక సమస్యలు, దాంపత్య కలహాలు, ప్రేమ వైఫల్యం వంటి పలు కారణాలతో భారత్‌లో 15 నుంచి 29 ఏళ్లలోపు మహిళల్లో ఆత్మహత్యలే శరణ్యమన్న భావన పెరుగుతోందని అధ్యయనంలో తేలింది. ఏటా ప్రతి లక్ష మంది మహిళల్లో కనీసం 33 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వాతావరణం, సామాజిక నేపథ్యం వంటి అనేక కోణాల్లో అధ్యయనం చేశాక దేశదేశాల్లో స్ర్తిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. భారత్ విషయానికొస్తే యుక్తవయసు, మధ్య వయసు మహిళల్లో ఆత్మహత్యల ధోరణి పెరుగుతోంది. ఇవే పరిస్థితులు మరికొన్ని దేశాల్లోనూ చోటుచేసుకున్నాయి.
సామాజిక పరిస్థితులు, పురుషాధిక్యత వంటి విషయాల్లో మార్పు వస్తే మహిళల్లో ఆత్మహత్యలు తగ్గవచ్చని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు రాఖీ దండోనా అంటున్నారు. ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ తరఫున ఆమె విస్తృత అధ్యయనం చేశారు. భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా విద్య, సాధికారతలో మహిళలు గతంలో కంటే మెరుగైన స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే, సామాజిక పరిస్థితుల్లో ఇంకా ఆశించిన మార్పులు చోటుచేసుకోవడం లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గడం, యువతులు స్వతంత్రించి పెళ్లిళ్లు చేసుకోవడంతో బాంధవ్యాల్లో మమతానురాగాలు తగ్గుముఖం పడుతున్నాయి. అనేక విషయాల్లో సముచిత ప్రాధాన్యత లేకపోవడం, వివక్ష చూపడం, ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం వంటివి మహిళలకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. పురుషుడితో పాటు సమాన హోదా లేకపోవడం, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేక పోవడం వంటివి మహిళలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకునే మహిళల సంఖ్య అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. అంతగా చదువు లేకపోవడం, ఆదాయ వనరులు పరిమితంగా ఉండడంతో పల్లెప్రాంతాల మహిళలు ఉన్నంతలోనే సంతృప్తిగా బతుకుతున్నారని సర్వేలో తేలింది.