Others

‘మీటూ’ అన్నందుకే వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత తమిళ సినీ, టీవీ, డబ్బింగు ఆర్టిస్టు చిన్మయికి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేయడం సరికాదు. సభ్యత్వ రుసుము చెల్లించని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు పైకి చెబుతున్నా అసలు కారణం కక్ష తీర్చుకొనేందుకే. ఎందుకంటే ఆమె డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు మీటూ ఉద్యమంలో తన మద్దతు తెలిపారు. తమిళ సినీరంగంలో తలపండిన ప్రముఖుడు, గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ రోజు ఆమెకి ఎదురైన ఈ ఉదంతం కచ్చితంగా ప్రతీకార చర్యనే. యూనియన్ సభ్యత్వం రద్దుతో డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఆమెకు లేనట్లే. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే ఉదాహరణ ఇది. లైంగిక వేధింపులను ఎదుర్కోవడమే కాకుండా, నిలదీసినందుకు బాధిత మహిళ శిక్షకు గురికావడం. నిందితుడు నిశ్చింతగా తల ఎగరేస్తూ ఉండగా, బాధిత మరింతగా వేధింపబడటం. మీటూ ఉద్యమం సఫలం కావాలంటే ఆరోపణల అనంతరం బాధిత మహిళకు అన్యాయం జరుగకుండా, కక్ష సాధింపులకు గురికాకుండా చూడాలి. సాధారణంగా బలమైన స్థానంలో ఉండే నిందితుడికి అన్నిరకాల అండదండలూ అందుబాటులో ఉంటాయి. వాడిపై చర్యలుండాలి. ఒక ప్రముఖ స్థానంలో ఉన్న మహిళకే మీటూ అనంతర కక్ష సాధింపులు తప్పనపుడు, సాధారణ ఉద్యోగిని పరిస్థితి ఏమిటి? కేంద్ర మంత్రి అక్బర్ రాజీనామా చేసేంతగా ప్రభావం చూపుతోందీ ఉద్యమం అంటూ సంతృప్తి చెందనక్కరలేదు. బాధితకు మరిన్ని బాధలు తప్పడంలేదని చెప్తోన్న చిన్మయి ఉదంతం, ఉద్యమ రీతుల మెరుగుదల అవసరాల్ని పట్టి చూపిస్తోంది. ఆమెకు అండగా నిలబడాలి. ఆమెలాంటి అసంఖ్యాక మహిళల రక్షణకు భరోసా ఇచ్చే దిశగా, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు తయారయ్యేలా వ్యవస్థని సంస్కరించాలి.

-డా. డి.వి.జి.శంకర్‌రావు