Others

గాజా గ్రాండ్ పియానో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2014లో గాజా స్ట్రిప్‌లో ఏకైక కన్సర్ట్ గ్రాండ్ పియానో ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని తట్టుకుని నిలబడింది. అంతకు మునుపు ఈ పియానో ఉన్న భవనం బాంబుల దాడిలో ధ్వంసమైపోయింది. అప్పుడు ఈ పియానోను ఒక స్వచ్ఛంద సంస్థ ఎంతో శ్రమించి పునరుద్ధరించింది. గాజాలో సంగీతం నేర్పించే పాఠశాలలు చాలా తక్కువ. అందులోని ఓ పాఠశాలకు ఈ పియానోను చేర్చింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఇటీవలే ఓ సంగీత కచేరీలో ఈ పియానోను వాయించారు. గాజా స్ట్రిప్‌లో ప్రత్యక్ష సంగీత కచేరీ చాలా అరుదు. దాదాపు 19 లక్షల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దిగ్బంధంలో జీవిస్తున్నారు. ‘ఈ పియానో ఎంత విచారంగా ఉన్నా దీనిపై సంగీతాన్ని వాయించాలనేటప్పటికి ఎంతో సంతోషంగా సంగీతాన్ని పలికిస్తోంది. ఈ పియానోను వాయిస్తోన్న ప్రతిసారీ అప్పుడు, ఇప్పుడు ఇది ఎలా ఉంది అన్నది నా మదిలో కదలాడుతూనే ఉంటుంది’ అని సారా అకెల్ అనే పందొమ్మిదేళ్ల సంగీత విధ్యార్థిని చెప్పింది.