Others

సెంట్రల్ ట్రస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యసాయి స్థాపించిన అన్ని సంస్థల నిర్వహణ కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ‘శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’గా దీన్ని పిలుస్తున్నారు. సత్యసాయి దీనికి ఫౌండర్ ట్రస్టీ. ప్రస్తుతం దీనికి తొమ్మిది మంది ట్రస్టీలతో బోర్డు ఏర్పాటు చేశారు. సత్యసాయి సోదరుడి కుమారుడు ఆర్.జే. రత్నాకర్‌తో పాటు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ మాజీ చైర్మన్ టీకేకే భగవత్, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కే. చక్రవర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపీ మిశ్రా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ విజయ్ జే కేల్కర్, ప్రభుత్వ మాజీ కార్యదర్శి జీఎస్‌ఆర్‌సీవీ ప్రసాదరావు, చెన్నైలోని మద్రాస్ డయాబెట్స్ రీసర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. మోహన్, ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. విజయ భాస్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ఎస్.ఎస్. నాగానంద్ ట్రస్టీలుగా ఉన్నారు. ఈ సెంట్రల్ ట్రస్ట్ తరచూ సమావేశమై పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. సెంట్రల్ ట్రస్ట్ అధీనంలోనే ఈశ్వరమ్మ మహిళా సంక్షేమ ట్రస్ట్ నడుస్తోంది. మహిళల సంక్షేమం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. మహిళల ఆర్థిక, ఆరోగ్య సంరక్షణకోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.

సేవా సంస్థలు..

సత్యసాయి బోధనల ప్రచారం, ప్రజలకు సేవలు అందించేందుకు కోసం సేవాసంస్థలు నడుస్తున్నాయి. విదేశాల్లో కార్యక్రమాలను కొనసాగించేందుకు శ్రీసత్యసాయి అంతర్జాతీయ సేవా సంస్థ, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు కొనసాగించేందు శ్రీ సత్యసాయి జాతీయ సేవా సంస్థ నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సత్యసాయి సేవా సంస్థలు, భజన మండళ్లు నడుస్తున్నాయి. విద్యార్థుల్లో మానవతావిలువలు పెంపొందించేందుకు ‘బాలవికాస్’ పేరుతో కేంద్రాలు నడుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో సేవాదళ్‌లు ఉన్నాయి. ప్రశాంతి నిలయంలోని అంతటా సేవాదళ్ కార్యకర్తలు భక్తులకు సేవలు అందిస్తుంటారు. సేవలు అందించేందుకు వేల మంది ముందుకు వస్తుండటంతో ముందుగానే ప్రశాంతి నిలయం అనుమతి తీసుకుని ఈ సేవాదళ్‌లు నిర్ణీత కాలంలో వచ్చి సేవలు అందిస్తున్నాయి. ప్రశాంతి నిలయంలోనే వీటికి కేంద్ర కార్యాలయాలున్నాయి.
అనంతపురం, మహబూబ్‌నగర్, మెదక్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 90 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేసేందుకు సత్యసాయి తాగునీటి సరఫరా ప్రాజెక్టు నడుస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయలు తాగునీటి సరఫరాకోసం వినియోగించారు.