Others

ఫిరాయింపులపై చర్యలు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2014లో అధికారం చేపట్టాక ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, గత ప్రభుత్వం ద్వారా నవ్వులపాలైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. అయితే గత నాలుగేళ్ళలో ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించుకోవచ్చునన్న ఒక విచిత్ర ప్రతిపాదనను ఫైనాన్స్ బిల్లు రూపంలో ఆమోదించారు. ఇది ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి మరింత పెరిగేందుకు తనవంతు సహాయం అందించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విపక్ష ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి ఫిరాయించారు. అవకాశవాదంతో ‘గోడ దూకిన’ ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రిపదవులు కూడా దక్కాయి. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో ప్రతిపక్ష సభ్యులను కొనుగోలు చేసి తద్వారా విపక్షాన్ని బలహీనపరచాలన్న అధికార పక్షాలు ఆడిన రాజకీయ వికృత క్రీడను చూసి ప్రజలు విస్మయం చెందారు. ఒక పార్టీ సిద్ధాంతంపై గెలిచి, అనంతరం ప్రజల విశ్వాసాలను వమ్ముచేసి పదవుల కోసం అధికారపక్షంలోకి దూకిన ఈ ‘జంప్ జిలానీ’లు ప్రజల తీర్పును ధిక్కరించారు. కాబట్టి వారిపై అనర్హత వేటువేయాలని మేధావులు, న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడ్డారు. వీరిపై తప్పక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న స్పీకర్లు కాలయాపన చేస్తూ వచ్చారే కాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వివిధ రాష్ట్రాల స్పీకర్ల వద్ద సుమారుగా యాభైకి పైగా ఇలాంటి ‘అనర్హత’ పిటిషన్లు పెండింగ్‌లో వున్నాయి. లోక్‌సభ స్పీకర్ అయిదుగురు ఫిరాయింపుదార్లపై తక్షణం చర్యలు తీసుకొని వుంటే, మిగతా ‘జంప్ జిలానీ’ల భవితవ్యం నిర్ణయమై వుండేది.
ఎన్నికల తర్వాత చట్టసభలో ముఖ్యమైన రెండు పార్టీలు మెజారిటీకి చేరువలో వచ్చి ఆగిపోయినప్పుడు ఈ జంప్ జిలానీలు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో గతంలో ఎన్నోసార్లు చూశాం. రోజుకో కండువా, పూటకోమాట మార్చే ఇలాంటి రాజకీయ అవకాశవాదులపై పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలన్న డిమాండ్‌ను, రాజకీయాలను ప్రక్షాళనం చేస్తామన్న హామీని మోదీ పట్టించుకోకపోవడం లేదు. దీంతో భాజపా కూడా ‘ఆ తానులోని ముక్కే’ అని అర్థవౌతోంది. విపక్షాల ర్యాలీకి హాజరయ్యారన్న కారణంతో మర్నాడే రాజ్యసభ నుండి శరద్ యాదవ్, ఆలీ అన్వర్‌లపై రాజ్యసభ అధ్యక్షుని హోదాలో వెంకయ్యనాయుడు వేటువేసి అత్యున్నత విలువలకు పట్టం కట్టామని అధికార పక్షం ప్రకటించింది. అనర్హత విషయంలో రెండుసభలు ఇలా వేర్వేరు ప్రమాణాలు పాటించడం ఆశ్చర్యకరం. ప్రజాప్రాతినిధ్య చట్టానికి పటిష్టంగా సవరణలు చేసి, ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్ప- ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కష్టం.
-సిహెచ్ ప్రతాప్