Others

బీచ్‌లో షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ఫిజీ దీవుల ట్రిప్ సక్సెసైంది. ఇన్‌స్టాలో అమ్మడి బికినీ ఫొటోలకు కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు. వారంపాటు ఫిజీ దీవుల్లో విలాసవంతమైన లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, పనిలో పనిగా నిరంతర బీచ్ ఫొటో షూట్లతో తన అందాలను సామాజిక మాధ్యమాలకు షేర్ చేసింది. నిజానికి రియా కెరీర్ ప్రస్తుతం అయోమయంలోనే ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రియా చేయని ప్రయత్నమంటూ లేదు. అందులో భాగమే ఫొటో షూట్లు. అప్పట్లో జలేబి సినిమాలో నటించిన తర్వాత మళ్లీ వేరొక చిత్రానికి సంతకం చేయలేదు. నిర్మాత మహేష్‌భట్‌తో అఫైర్ సైతం ఈ బ్యూటీకి కొత్త అవకాశాలు తేలేకపోతోంది. ఓవరాల్‌గా రియా కెరీర్ జీరో అంటోంది ఇండస్ట్రీ. సౌత్‌కు పరిచయమైనా, ఇక్కడా దర్శక నిర్మాతలు అవకాశాల ఊసెత్తకపోవడంతో, పూర్తిగా మోడలింగ్ కెరీర్‌కే పరిమితమైంది. తాజా బీచ్ గ్లామర్ షోతో ఒక్కరైనా కనెక్ట్ కాకపోతారా? ప్రాజెక్టు దొరక్కపోతుందా? అని ఎదురు చూస్తోంది రియా.