Others

నువ్వుంటే నా జతగా.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు నాకు జతగావుంటే సృష్టిలో ఇక దేనితోనూ పనిలేదంటూ ప్రేమికురాలికి -ఓ ప్రేమికుడు ప్రపోజ్ చేశాడనుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. చాలా సినిమాల్లో ఇటువంటి ఎక్స్‌ప్రెషన్స్ చాలా వినొండచ్చు. కాకపోతే శంకర్ తెరకెక్కించిన ఐ -(మనోహరుడు) చిత్రంలో హీరో విక్రమ్ ప్రపోజ్ చేసిన స్టయిల్ వేరు, పాట వేరు. ఆ పాటే -నువ్వుంటే నా జతగా. తెలుగు వర్షన్ మనోహరుడు కోసం రామజోగయ్య శాస్ర్తీ రాసిన పాట సినిమా విడుదల టైంలో సెనే్సషన్ క్రియేట్ చేసింది. ఈ పాటే ఆడియన్స్‌ని థియేటర్స్‌వైపు మళ్లించింది కూడా. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల సత్తాను ఈ చిత్రం చాటలేకున్నా -ఈ పాట మాత్రం చిరస్మరణీయమైంది.
వీచే చిరుగాలిని వెలివేస్తా/ పారే నదిని ఆవిరి చేస్తా/ నేనున్న నేలంతా మాయం చేస్తా/ లేనే లేదే అవసరమే/ నువ్వే నాకు ప్రియవరమే -అంటూ సాగే పాటలో ఫాంటసీ కంపోజిషన్స్, విక్రమ్ అప్పియరెన్స్, అమీజాక్సన్ అందాలు.. వీటన్నింటికి మించి సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ స్వర బాణీ, అప్పుడప్పుడే స్క్రీన్‌కు తన కొత్త గొంతును పరిచయం చేస్తున్న సిధ్ శ్రీరామ్ మనల్ని మెస్మరైజ్ చేసేశారు. నువ్వుంటే నా జతగా/ నేనుంటా ఊపిరిగా అంటూ -అగాథ లోతుల్లోంచి వినిపించే ఎకో స్వరంలా పాటెత్తుకున్న సిథ్ గొంతుకు శ్రోతలు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి అనలేం.
నువ్వైనా నమ్మవుగా/ చెలియా నేనెవరంటూ/ ఎవరూ గుర్తించరుగా/ నా ప్రేమవు నువ్వంటూ/ నీ కోసం ఈలోకం బహుమానం చేస్తా/ నువ్వులేని లోకంలో నన్ను నేనే బలిచేస్తా-నువ్వుంటే నా జతగా
ప్రేమకు అర్థం ఏదంటే/ నిన్నూ నన్నూ చూపిస్తా/ అడ్డొస్తే ఆ ప్రేమైనా/ నా చేతుల్తో నరికేస్తా/ సూదీ దారం సాయంతో/ కురులు మీసం కుట్టేస్తా/ నీళ్లను దాచే కొబ్బరిలా/ గుండెల్లో నిను కప్పేస్తా -అంటూ సాగే లవ్ ప్రపోజల్‌లో ఓ గాఢత కనిపిస్తుంది. అందమైన ప్రేమికుడు విలన్ల కుట్రకు బలై జంతువులా మారిపోయిన సందర్భంలో -తనను గుర్తుపట్టమంటూ ఒకవైపు, అతన్ని గుర్తుపట్టలేక భయంకర జంతువును చూసినట్టు చూస్తున్న ప్రేమికురాలి భయాన్ని తలచుకుంటూ వేదన మరోవైపు.. ఇలా ఓ ఫాంటసీ ఫీల్‌ను శంకర్ స్క్రీన్‌కు ఎక్కించిన రీతి అద్భుతమనే చెప్పాలి. ఈ పాటను ఆడియోలోకంటే -వీడియోలో చూస్తే ఆ ఆనందమే వేరు.

-పార్వతీశం, కందుకూరు