Others

వినాయక్‌కు నో చాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం ఖైదీ నెంబర్ 150కు దర్శకత్వం వహించి దాన్ని బ్లాక్‌బస్టర్‌గా మలిచినా ఆ సక్సెస్ క్రెడిట్ వినాయక్ ఖాతాలో పడలేదు. తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ వినాయక్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసింది. దాని తర్వాత బాలయ్యతో సినిమా లైన్‌లో ఉందన్నారు. ఇప్పుడు అది కూడా సైడ్ అయిపోయిందట. ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ బాలయ్యతో ‘జైసింహా’ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయవంతం కావడంతో బాలయ్య- కళ్యాణ్ బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు వినాయక్‌ను దర్శకునిగా తీసుకున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది గానీ వినాయక్ చెప్పిన కథలేవీ బాలయ్యను మెప్పించలేదట. బాలయ్య ఎంత టైమ్ ఇచ్చినా వినాయక్ సరైన కథ తీసుకురాలేకపోవడంతో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అంటున్నారు. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను.. అనిల్ రావిపూడి ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయట. మరోవైపు వచ్చే ఏడాది ఎలెక్షన్స్ కూడా ఉండడంతో వినాయక్‌తో సినిమా చేసే అవకాశం లేదని టాక్.