Others

పూజ చేద్దాం రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడికి అతి చేరువగా వెళ్లాలనే ఆరాటంలో జీవులు వివిధ రకాలుగా స్వామిని అర్చిస్తూ వుంటారు. రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే అతి సామాన్యుడికి కూడా అందుబాటులో వుండే రెండు మార్గాలగురించి చర్చించుకుందాము. అందులో ఒకటి పూజ, రెండవది ఆరాధన. ఈ పూజల విషయంలో కొన్ని నియమాలను పెట్టుకోవాలంటారు. పూజ సూర్యోదయానికి ముందు చేసినా, ఆలస్యంగా చేసినా వాడిన పూలు భగవదారాధనకు వాడకూడదు. పూజా సామగ్రిని కుడివైపు వుంచుకోవాలి. తెచ్చుకున్నవన్నీ ముందుగా భగవంతునికి సమర్పించిన అనంతమే ఎవరికైనా పెట్టాలి.
విష్ణుమూర్తికి తులసి అత్యంత ప్రీతిపాత్రమైనది. పవిత్రమైన రోజుల్లో తులసి దళాలను కోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత వీటిని కోయడం మంచిది కాదు. స్ర్తిలు తులసి దళాలను కోయకూడదు. తులసిదళాన్ని భక్తిపూర్వకంగా కుడి చెవిలో ధరించాలి. చాతుర్మాస దీక్ష సమయంలో అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమినుంచి కార్తీక శుద్ధ పౌర్ణమివరకూ తులసి మొక్కను ఒకచోటినుంచి మరొక చోటికి మార్చడం తగదు.
ధూపదీపం లేకుండా పూజ పనికిరాదంటారు. ఇంటిలో అగరుబత్తులు వెలిగించి, సాంబ్రాణి వేసి ఆరంభించాలి. గ్రామదేవతలకు గుగ్గిలం కూడా వాడవచ్చు. హారతిని ఇచ్చిన తర్వాత కర్పూరం కళ్ళకు అద్దుకోవాలి. వ్రత పుస్తకాలను ఎప్పుడూ పూజకు కుడివైపునే ఉంచుకోవాలి. కొబ్బరికాయ కొట్టడం పూజలో ముఖ్యం. పీచు ఎడమవైపు వుండేటట్లు చూసుకోవాలి. కొందరు కొబ్బరికాయకు బొట్టుపెడతారు. లక్ష్మీదేవినీ, సరస్వతీదేవిని ఆవాహనం మాత్రమే చేసుకోవాలి కానీ ఉద్వాసన కూడదు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజకు లోహ విగ్రహాలు మూడు అంగుళాలకు మించి ఎత్తు ఉండటం ఇంటి యజమానికి మంచిది కాదు. చిన్న చిన్న విగ్రహాలైనా కూడా వాటికి ముక్కు, కళ్ళూ, నోరూ అరిగిపోకుండా మంచిగా వుండేలా చూడాలి.
ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంటిలో పూజ చేయడానికి అనువైన చోటును ఎన్నుకోవాలి. ముఖ్యంగా భగవంతునిపై మనస్సు పూర్తిగా లగ్నం చేసి ధ్యానించాలి. కేవలం సుఖభోగాల కోసం గాక ఆధ్యాత్మిక ఆనందం కోసం భగవంతుడిని ప్రార్థించాలి. సుఖ భోగాలను కోరుకుంటుంటే వాటి అంతం అనేదే ఉండదు. ఎన్ని సమకూరినా ఇంకా కొత్త కొత్త కోర్కెలు ఉద్భవిస్తూనే వుంటాయి. అందువలన భగవంతుడు తమకు ఇచ్చిన దానితో తృప్తి చెంది నిరంతరం భగవంతుడి సేవలో నిమగ్నం కావాలి. భగవంతుడికి మనకు ఏమి కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసునన్న నమ్మకంతో పూజించాలి.

--డా పులివర్తి కృష్ణమూర్తి