Others

కంచె మేసిన చేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులకు ఏవైనా కష్టాలు వస్తే వారు దేవుడికి మొరపెట్టుకుంటారు. మరి దేవుడే కష్టాలు కలిగిస్తే ఏమవుతుంది? ఇంకెవరికి చెప్పుకోవాలి? దేశంలో ఎక్కడైనా భారీగా అవినీతి ఆరోపణలు వస్తే- వాటిలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సిబిఐ) రంగంలోకి దిగుతుంది. ఐతే- సిబిఐలోనే అవినీతి వ్యవహారం రచ్చకెక్కితే ఇంకెవరికి చెప్పుకోవాలి...?
ప్రస్తుతం న్యూఢిల్లీలో ఒక తీవ్ర సంక్షోభం ఏర్పడింది. అక్కడి సిబిఐ యంత్రాంగంలో ప్రథమ, ద్వితీయ శ్రేణి ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేసు కోర్టు పరిధిలోకి చేరింది. ఈ సంస్థలో సీనియర్ అధికారులు అలోక్‌వర్మ, రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అలోక్‌వర్మ నుండి రాకేశ్ ఆస్థానాకు ఫైళ్లు అందటం లేదన్నది ఆరోపణ! ఇది అధికారుల్లో పదోన్నతుల కోసం జరుగుతున్న పోరాటం కాదు. వీరి వెనుక రాజకీయ శక్తులున్నాయి. రాకేశ్ ఆస్థానా ప్రస్తుతం కీలకమైన కేసులు విచారిస్తున్నాడు. అందులో అగస్టా హెలికాప్టర్ కేసు, మమతా మెనర్జీ నారదా టేపులు, శారదా చిట్‌ఫండ్ కేసులు, పి.చిదంబరం, కార్తి చిదంబరం కేసులు, లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులు వంటివి ఉన్నాయి.
మూడున్నర కోట్ల రూపాయల మేరకు రాకేశ్ లంచం తీసుకున్నాడన్న ఆరోపణ తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ సందర్భంగా కొందరు తెలుగువారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. సుఖేశ్ గుప్తా (వజ్రాల వ్యాపారి హైదరీ), షబ్బీర్ అలీ (కాంగ్రెస్), మొయిన్ అక్తర్ (మాంసం ఎగుమతులు), సీఎం రమేష్ (రాజ్యసభ సభ్యుడు- తెలుగుదేశం) వంటి పేర్లు బయటపడ్డాయి. రాకేశ్ ఆస్థానా గుజరాత్‌లో లోగడ కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు. ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇదంతా ఒక పెద్ద రాజకీయ క్రీడగా మారిందని అర్థం. రాకేశ్ ఆస్థానాను విచారణ బాధ్యతల నుండి తప్పించినంత మాత్రాన కేసులు మాఫీ కాజాలవు. 2019లో నరేంద్ర మోదీకి బదులు రాహుల్ గాంధీ లేదా మమతాబెనర్జీ ప్రధాని అయితే అప్పుడు 30వేల కోట్ల అవినీతి కేసులు బుట్టదాఖలు అవుతాయా? ఇదీ కొందమంది మేధావుల అనుమానం!
***
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటాయి. వాటిని పాలకులు నియంత్రించటం తగదు. ఇన్‌కంటాక్స్ శాఖవారు ఎవరైనా పన్నులు కట్టకపోతే నోటీసులు పంపుతారు. కాపిటల్ గైన్స్‌లో తేడాలు కనబడితే పెనాల్టీ సహా జరిమానాలు వసూలు చేస్తారు. అది వారి ధర్మం. ‘ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఐటీ శాఖ దాడులు జరిపిస్తున్నారు..’ అని ఆరోపించటంలో అర్థం లేదు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేయిస్తున్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. 1980వ దశకంలో రాజీవ్ గాంధీ బోఫోర్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఓ ప్రముఖ దినపత్రికలో పతాక శీర్షికలలో వార్తలు వచ్చాయి. వెంటనే ఆ పత్రికకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు జరిగాయి. న్యూస్‌ప్రింట్ సరఫరాను సైతం నిలిపివేశారు. ఐతే- ఆ పత్రిక యాజమాన్యం ఏమీ భయపడలేదు. ఇప్పుడు సీఎం రమేష్‌కు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. దాడులు జరిపిన అధికారులకు చాలా కీలక పత్రాలు లభించాయి. వివరాలు త్వరలోనే వెల్లడి అవుతాయి. సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఎంత? ఒకవేళ రమేష్ ఆస్తులలో అక్రమ సంపాదన ఉంటే పెనాల్టీ సహా పన్ను కట్టాలి. ఆరోపణలు అవాస్తమైతే ఆయన కేసుల నుండి బయటపడతారు. అంతేకాని అసలు సోదాలు జరగటమే తప్పు- కక్షసాధింపు అనటం తగదు. మోదీ అధికారంలోకి వచ్చాక సీబీఐని బలోపేతం చేశారు.
అంతర్గత కుమ్ములాటలతో సీబీఐ బలహీనపడితే కాంగ్రెస్ లాభపడుతుంది. కర్నాటకలోనూ పలువురు రాజకీయ నాయకుల ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. బాత్‌రూంలో వజ్రాలు దాచిపెట్టడం నేరమా? కాదా?? గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో గుట్టలకొద్దీ రత్నాలు, బంగారు బిస్కెట్లు దొరికాయి. వీకే శశికళ సీఎం జయలలితకు బినామీగా వ్యవహరించింది. ఆ తర్వాత జయలలిత, శశికళ ఇద్దరూ అరెస్టు అయ్యారు. అక్రమ ఆస్తుల కేసులో ప్రస్తుతం శశికళ జైలులో ఉన్నారు.
***
తనకు అన్యాయం జరిగిందంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రీయించాడు. రాఫెల్ కుంభకోణంపై సిబిఐ విచారిస్తుందనే భయంతో నరేంద్ర మోదీ ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నాయకుడు అభిషేక్ మనుసంఘ్వీ ఆరోపిస్తున్నారు. హెచ్‌ఎఎల్ సంస్థపైనా ఐటీ దాడులు జరిగాయి. అంటే అవినీతిని రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్షాల మీద మోదీ దాడులు చేయిస్తున్నాడనే ఆరోపణలో నిజం ఎంత? యుపిఎ కాలంలో కూటమి నుండి డిఎంకె తొలగగానే స్టాలిన్ (డిఎంకె) ఇంటిపై దాడులు జరిగాయి.
***
ఇటీవల అమృతసర్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 61 మంది చనిపోగా ఎందరో క్షతగాత్రులైనారు. రావణ దహనకాండ సందర్భంగా కొందరు రైలుపట్టాలపై కూర్చుని ఈ వినోదం తిలకిస్తున్నారు. ఇప్పుడు- తప్పుమీదంటే అంటే మీది అని నాటకం మొదలుపెట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రావణ దహన సభకు పోలీసుల అనుమతి ఉందా? రైల్వేట్రాక్‌మీద జనం ఎట్లా కూర్చుంటారు? ఇందులో రైల్వేశాఖ తప్పు ఏమీ కనిపించదు. ఐనా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్ష నాయకులు ఆరోపణలు మొదలుపెట్టారు. బాధిత కుటుంబాలపై సానుభూతి లేకుండా ఇలా రాజకీయ నాటకాలు మొదలుపెట్టడం తగునా? చనిపోయిన వారంతా యుపీ, బిహారు ప్రాంతాల చి భుక్తికోసం పంజాబ్‌కు వచ్చిన వలస కూలీలు. పంజాబ్‌లో చాలాకాలంగా మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఇక్కడి పాలకులు అవేవీ పట్టించుకోవటం లేదు. రైల్వేశాఖ వారు జాగ్రత్తలు తీసుకొని జన నష్టం జరుగకుండా చూడాలి. లోగడ ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే అప్పటి మంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన బాధ్యతల గురించి ఏమీ మాట్లాడటం లేదు.
*