Others

కర్మయోగ మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశంగా ఉన్నది. అన్నివేళలా అందరూ ఆచరింపదగినది. ఈ విషయాన్ని శ్లోకాలలో విపలీకరిస్తూ, అర్జునా! కర్మలనాచరించు వేళల్లో, ఆ కర్మనెట్లు చేయవలెనో, దానిని గూర్చిన వివేకమవసరము. ఆ వివేకమునే బుద్ధి అంటారు. అలాంటి బుద్ధితో గూడి కర్మలనాచరించినచో జీవుడు కర్మబంధనాలలో చిక్కుకొనడు. కర్మచేసిననూ బంధింపబడరాదు. గీతాచార్యుడు 2వ అధ్యాయం 40వ శ్లోకం ద్వారా వివరించారు.
శ్లో॥ నేహాభిక్రమ నాశోస్తి- ప్రత్యవాయోనవిద్యతే
స్వల్ప మప్యస్య ధర్మస్య- త్రాయతే మహతో భయాత్’ అంటూ కర్మయోగం ప్రారంభమైనచో అది నిష్ఫలము కాదు. కానేరదు. అది పూర్తికావడానికి ముందుగా, ఏ కారణం చేతనైనను మధ్యలో నిలిచిననూ దోషములేదు. వివేకముతో గూడిన ఈ కర్మయోగమును ప్రారంభించిననూ వ్యర్థము కానేరదు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది సత్ఫలమును గలుగజేస్తుంది. దీనికొక ఉపమానము పరమాత్మ వివరిస్తూ, విత్తనమును నేలలో నాటిన తరువాత చివరి వరకూ నీరు, ఎరువులచే పోషించిన మాత్రముచే ఫలమును చక్కగా అందిస్తుంది. కాని, దానివలన దోషమేదీ కలుగదు. ఇదియే నిష్కామకర్మయోగము అని భగవానుడుపదేశించినాడు.
ఈ విశ్వంలో అన్ని భయాలలో గొప్ప భయము జీవులకు మరణ భయము. జనన మరణ రూప సంసార భయము. ఇది తొలగిపోవాలంటే నిష్కామకర్మానుష్ఠానము తప్పనిసరి. ఒక నిప్పురవ్వ ఒక భయంకరమైన అరణ్యమును బూడిదచేసినట్లుగా, చిన్న ఓడ విశాల సముద్రమును దాటించునట్లు నిష్కామకర్మాచరణమే ఒక పరమార్థ సాధనగా జీవులను కాపాడుతుంది.సాధకులు ఈ విషయంలో దిగులు పడరాదు. సాధనను విడువక ఆచరిస్తూ వుండాలి. కర్మానుష్ఠానంలో పరిపూర్ణ విశ్వాసం వుంచాలి. కర్మయోగమును ఒక ధర్మంగా స్వీకరించి ఆచరణలో చూపాలన్నాడు. సాధకులకు ఈ విషయంలో ఓర్పు- నేర్పూ కావాలన్నారు. కర్మాచరణమనునది మునులకూ, యోగులకూ, ఋషులకేగానీ, సామాన్య మానవులం మనకు పనికి వస్తుందా అని ఆలోచించి, దిగులు చెందక ధైర్యంతో మోక్షప్రాప్తికీ, సంసార భయనాశనానికి ఇది ఒక వరప్రసాదంగా స్వీకరించాలని తెలిపారు.
సకల జీవులు భగవద్వాక్యముల పట్ల విశ్వాసం ఉంచి, ధైర్యంతో సాధన చేయాలి. ఉత్తమ కర్మయోగి స్థిరచిత్తంతో నిలిచి, నిశ్చయంతో కూడిన బుద్ధిని అలవరచుకోవాలి. అదే నిశ్చయాత్మక బుద్ధియని ఒక శ్లోకంలో తెలిపారు.
ప్రాపంచిక వస్తువుల నాశ్రయింపరాదనీ, దృశ్య పదార్థాలపైకి పరుగులు తీయరాదన్నారు. చంచల మనస్సుతో వ్యవహరించక ఏకాగ్రతతో కర్మలనాచరించాలని అన్నారు. చిత్తము చంచలమైనచో శాంతి లేక జీవులు తల్లడిల్లుదురు. వివేకవంతుడు దైవమందు నిశ్చయబుద్ధిని అవలంబించాలి’. కామ్యకర్మలు జన్మ అను సంసార చక్రమున జీవుని పడవేస్తాయి. అర్జునా! జీవులు నిష్కామకర్మనే ప్రోత్సహించాలి. కామ్యకర్మలను నేను ప్రస్తావించను. కామ్యకర్మలు దారుణ ఫలితాలను అందిస్తాయి. ఇలాంటి వాటిని ముముక్షువులాశ్రయింపరాదు.
కామ్యకర్మ నిరతుల తీపి మాటలను వినరాదు. అలాంటి వారితో సాంగత్యము- సహవాసము చేయరాదు. పరమాత్మ ఈ సమస్యలకు చక్కని పరిష్కార మార్గమును అర్జునునికి వివరిస్తూ, సత్పురుషుల సాధుపుంగవుల- విరాగుల సాంగత్యమును చేసి, మనసును దైవోన్ముఖముగా గావించు కోవాలి. గాన విషయాసక్తిని త్యజించవలెనని తెలిపాడు. అర్జునా! కర్మము చేయుట యందే నీకు అధికారం గలదు గాన ఫలమునాశించుటకు అధికారం లేదంటూ, నీవు యోగ నిష్ఠలో- - ధ్యానంలోనుండి సంగమును త్యజించి కార్యము ఫలించిననూ- ఫలించకున్ననూ సమదృష్టిలో నుండి కర్మలను చేయుమన్నాడు. కర్మానుష్ఠాన పరులు ముందుగా యోగస్థులై, దైవబుద్ధినీ ఆత్మబుద్ధినీ అలవరచుకొని, ధర్మనిర్వహణలో కర్మను నిర్దుష్ఠముగా, నిష్కామముగా ప్రవర్తించి- జ్ఞాన విచారణ, ఆత్మచింతనలో, కర్మయోగ నిర్వహణలో సఫలీకృతులు కావలెనని దీవించి- ఆ ఉపదేశామృతమును త్రాగి విజయుడ వైచరించమని ఆకాంక్షించారు గీతాచార్యులు. కర్మయోగ మహిమను వర్ణించి వివరించుట సమాజ హితమునకేయని సకల జనులూ గుర్తింకోదగిన ధర్మముగా, సత్కర్మముగా భావించి, ఆ రీతిలో చరించి- తరించి- ధన్యులుగావాలి. దైవం జూపిన మహనీయ మార్గములో పయనించి సత్ఫలితాలను పొందాలి.

-పి.వి.సీతారామమూర్తి 9490386015