Others

‘మణి’పూస మేరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ముగ్గురు పిల్లల తల్లి.. ఊరూ పేరూ లేని ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోతుంటే ఇక రాణించడం కష్టమన్నారు. ఈ విమర్శలు ఆమెను ఆపలేకపోయాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటకుండా అడ్డుకోలేకపోయాయి. కెరీర్‌లో ఆమె సాధించని టైటిల్ అంటూ లేదు.. అయినా ఆమెలోని చాంపియన్ ఊరుకోలేదు. యువక్రీడాకారిణులతో పోటీపడింది.. గెలిచింది.. మరో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆమే బాక్సింగ్ మహారాణి మేరీకోమ్.. ముప్ఫై అయిదు సంవత్సరాల ఈ మణిపురి తార ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలని మేరీ తపించింది. తర్వాత మేరీకి ఏదీ కలిసి రాలేదు. తనకు కలిసొచ్చిన 48 కిలోల విభాగం నుంచి 51 కిలోలకు మారాల్సి వచ్చింది. మొదట్లో తనకన్నా జూనియర్ల చేతిలో ఓడిపోయింది. అయితే వియత్నాంలో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడంతో మేరీలో ఉత్సాహం పుంజుకుంది. ఆ ఉత్సాహంతోనే కామనె్వల్త్ క్రీడల్లో తొలిసారి బంగారు పతకాన్ని అందుకుంది. అదే ఉత్సాహంతో తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను అందుకుంది. అంతేకాదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏడు బంగారు పతకాలు సాధించిన తొలి బాక్సర్‌గా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.