Others

ఫ్యాషన్ పొరపాట్లు దిద్దుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకీ మారుతున్న ట్రెండ్‌ని చెప్పేదే ఫ్యాషన్ అని అందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఆ ప్రభావం మన ఆహార్యంపై పడుతుంది. మరి ఆ పొరపాట్లను ఎలా దిద్దుకోవాలో చూద్దామా..
* కాలేజీ, ఆఫీసు, రోజువారీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు లైట్ మేకప్ వేసుకుంటే మంచిది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మేకప్ వేసుకుంటే ప్రత్యేకంగా కనిపించవచ్చు.
* చిరుగుల జీన్స్ ఫ్యాషనే కానీ అన్ని సందర్భాలకూ ఇది బాగోదు. స్నేహితులతో పార్టీకి వెళ్లేటప్పుడో, పిక్నిక్‌కు వెళ్లేటప్పుడో ఇది నప్పుతుంది. గుడికో, కుటుంబంతో బయటకు వెళ్లేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఈ జీన్స్ బాగుండదు.
* ఆటలకు, నడకకు, జిమ్‌లకు వాడే బూట్లు సౌకర్యంగా ఉంటాయి కానీ ఇవి జీన్స్, స్కర్టులపైకి పనికిరావు. మిగతా సమయాల్లో ఆయా దుస్తులకు, సందర్భానికి తగినట్లు బూట్లను మారుస్తూ ఉండాలి.
* స్కిన్‌టైట్ జీన్స్ సన్నగా ఉన్నవారికే నప్పుతుంది కానీ లావుగా ఉన్నవారికి కాదు. స్కిన్‌టైట్ జీన్స్ కొనాలనుకునేవారు శరీరాకృతిని, వయసుని దృష్టిలో పెట్టుకోవాలి.
* అలాగే దుస్తులు ఎంపిక చేసుకునేటప్పుడు మ్యాచింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దుస్తులతో పాటు వేసుకునే చెప్పులు, హ్యాండ్‌బ్యాగు తదితర అలంకరణ వస్తువులు కూడా నప్పుతాయో లేదో ఒకటికి రెండుసార్లు వేసుకుని చూసి కొనాలి. దుస్తుల రంగు ముదురు వర్ణంలో ఉంటే హ్యాండ్‌బ్యాగు లేత రంగులో ఉండాలి. అలాగే లేత రంగు దుస్తులకు ముదురు రంగు హ్యాండ్ బ్యాగు నప్పుతుంది. నగల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న సందర్భాలకు నగలు అతిగా వేసుకోకపోవడమే మంచిది. వేసుకోవాలనుకుంటే వీలైనంత సింపుల్‌గా వేసుకోవడం మంచిది. అదే వివాహాది శుభకార్యాలకు, ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగేటట్లైతే నగలు ఎక్కువగా వేసుకున్నా ఇబ్బంది ఉండదు.