Others

శ్రీవిద్యలో షట్చక్రాల జ్ఞానం అవసరం ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
====================================================================

ఈ లోకములయందును, సత్వము, రజస్సు, తమస్సు కలవు. ఆ విధముగ అణువునందు, మానవ శరీరమునందు, భూమియందు సౌర మండలమునందు, విశ్వమునందు పైన చెప్పిన ఏడు రకముల ప్రజ్ఞామయ కేంద్రములు పనిచేయుచున్నవి. విశ్వమునందలి 7 లోకములు, సప్తఋషి మండలము చేతను, సౌర మండలము నందలి 7 లోకములు, 7 గ్రహముల చేతను మన శరీరమునందలి 7 ప్రజ్ఞామయ కేంద్రముల (చక్రములు) చేతను నియంత్రించబడుచున్నవి. ఇట్టి ప్రజ్ఞావిలసితమైన కుండలినిశక్తి విశ్వమందు, విశ్వకుండలిని లేక ఆదిశేషుడు లేక అనంతుడంటున్నాము. అనగా (ళ్పళూ ళశజూజశ ళశళూక). మన శరీరమునంధు ప్రజ్ఞామయ కేంద్రముల ద్వారా కుండలిని శక్తి వెనె్నముక వెంబడి శిరస్సులోనికి వ్యాపించియున్నది. కుండలిని యోగ సంబంధమైన శ్రీవిద్యలో షట్చక్రాల గురించిన జ్ఞానం చాలా అవసరం. మానవుణ్ణి ‘ఊర్ధ్వజీవి’అంటాము. దానికి కారణము వెనె్నముక నిటారుగా ఉండటమే. తిర్యక్కులకు (జంతువులకు) వెనె్నముక అడ్డముగా ఉంటుంది. వెనె్నముక వెంట సుషుమ్న నాడి ననుసరించి క్రిందినుండి పైకి వరుసగా ఆరు శక్తికేంద్రాలుంటాయి. అవి 1. మూలాధార 2. స్వాధిష్ఠాన 3. మణి పూరక 4. అనాహత 5. విశుద్ధ 6. ఆజ్ఞాచక్రములు. ఇవికాక బ్రహ్మరంధ్రమువద్ద మానవ ప్రజ్ఞకతీతముగా ‘‘సహస్రార చక్రం’’ (శిరస్సుపై భాగమందలి మాడు) ఉంటుంది.
ఈ చక్రాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. వివిధ మతముల యందు, వివిధ దేశములయందు కూడ ఈ విషయమై కొంత పరిజ్ఞానము కలదు.
జైన మతాచార్యుడైన మహావీరుడి దగ్గరకు ఎవరైనా వచ్చినపుడు వారి శరీరంలోని చక్రాల (శక్తికేంద్రాల) స్థితిని, పనితీరుని పరిశీలించడమే పనిగా పెట్టుకున్నాడు. వచ్చిన వ్యక్తిలో ఎన్ని చక్రాలు చైతన్యవంతంగా వున్నాయో, అతడు యింకా ఎన్ని జన్మలు యెత్తవలసి వుంటుంది అనే విషయాలు చూసేవాడు. మన శరీరాంతర్గతంగా మనకు తెలియని కనబడని మనస్సు వుంది. శరీరపు లోతుల్లోని కేంద్రాలు (యోగాలో చక్రాలు అంటాము) అవి ఎన్నో జన్మల పరంపరలో ఏర్పడిన రూపాలుగా చెప్పబడ్డాయి. తెలిసినవారు, ఒక చక్రంపై చెయ్యిపెట్టి అది ఎంత చురుకుగా వుందో చెప్పగలరు. మనలోని చక్రాలను స్పర్శించి వాటిని మనం ఎప్పుడైనా అనుభూతి చెందింది లేనిది తెలుసుకోవచ్చంటారు. ‘‘ఓషో’’. వందలాది మనుష్యుల చక్రాలతో పరిశోధన జరిపి, ఒకటి లేదా రెండు మహాఅయితే మూడుచక్రాలు మాత్రమే చైతన్యం పొందుతున్నట్లు గమనించి ఆశ్చర్యపడ్డానంటారాయన. సాధారణంగా అవి నిద్రాణస్థితిలో వుంటాయి. వాటిని చైతన్యవంతం చేసే ప్రయత్నం మనం ఎప్పుడూ పూర్తిగా చేయం. ఏడుచక్రాలు చైతన్యవంతం చేసుకున్న వ్యక్తికి అదే చివరిజన్మ అవుతుంది. అటువంటి వ్యక్తి మరోజన్మ ఎత్తవలసిన అవసరం ఉండవు. అదే ముక్తి, నిర్వాణం, మోక్షం.
జపాన్ దేశమందు వ్యాప్తిలోనున్న జెన్ (బౌద్ధ) మతమునందు పైన పేర్కొన్న ఏడు చక్రాలను ఏడు సింహములుగా వ్యవహరిస్తారు. ‘జెన్’మతము ప్రకారం మూలాధార చక్రాన్ని కామకేంద్రమంటారు. ఇది మొదటి చక్రం. దీనియందు మనిషి శరీరంలోని జీవశక్తి అంతా నిక్షిప్తమై వుంటుంది. రెండవది స్వాధీష్టాన చక్రం. జపాన్ దేశస్థులు దీనిని ‘‘హరకేంద్రము’’ అంటారు. ఆత్మహత్యను జపనీయులు ‘‘హరకిరి’’ అంటారు. ఆత్మహత్య చేసుకోదలచినవారు స్వాధిష్టాన చక్రమైన ‘‘హర’’కేంద్రములో కత్తితోగుచ్చితే ఏమాత్రం బాధ తెలియకుండా నిశ్శబ్దంగా ప్రాణంపోతుందని వారి విశ్వాసం. మూడవది నాభివద్దనున్న ‘‘మణిపూరక చక్రం, నాలుగవది హృదయంవద్ద వుండే అనాహత చక్రం, అయిదవది గొంతుక దగ్గరుండే విశుద్ధ చక్రం. ఆరవది భృకుటివద్దనున్ను ఆజ్ఞాచక్రం. ఏడవది శిరస్సు పైభాగం మధ్యనుండే సహస్రార చక్రం. ఈ చక్ర వ్యవస్థను అర్థంచేసుకుని ధ్యానంచేస్తే మనిషిలోని జీవశక్తి (మనం కుండలిని అంటాం) ఆరోహణ క్రమంలో పైకి కదిలి మూలాధారంనుండి సహస్రారానికి చేరుతుందని, ప్రతి చక్రానికి దానిదైన భావవ్యక్తీకరణ వుంటుందని ధ్యానం ద్వారా వ్యక్తి తనలోని జీవశక్తిని ఏ చక్రం వద్దకు చేరిస్తే ఆ ప్రకారం వారి జీవితం పరిణతి చెందుతుందని జపనీయులు భావిస్తారు. మనిషి ఆత్మహత్య చేసుకుంటే స్వాధిష్టాన చక్రమైన హరకేంద్రం నుండి ప్రాణం మరొక గర్భంలోకి ప్రవేశిస్తుందని, అదే ప్రాణం శిరస్సుపై భాగమందలి సహస్రార చక్రంనుండి బయటకు వెడలిపోతే (దీనిని మనం కపాలమోక్షం అంటాము) అటువంటి ఆత్మ మరల జన్మతీసుకోకుండా అనంత విశ్వంలో విలీనవౌతుందని జెన్ మతస్థులు (జపాన్ బౌద్ధులు) విశ్వసిస్తారు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590