AADIVAVRAM - Others

వసుధైక కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏనాటి నుండియో ఈ పుణ్యభారతి
విశ్వగురువుయయి వెలసెనిచట
విద్యల కాణాచి వేద సంస్కృతినిచ్చి
జగతి దేశాలలో ప్రగతి దెచ్చె
సంస్కృతిన్ ప్రభవించు సంస్కారములనిచ్చు
విద్యలన్ గరపిన విమలచరిత
ఈజిప్టు మొదలుగా ఎన్ని జాతులకొయా
విజ్ఞానసుధలిచ్చి వెలుగునిచ్చె
పశ్చిమాత్యుల కుట్రలన్ భంగపడియు
జగతి సౌఖ్యమే కాంక్షించు జాతి మనది
మన పునాదుల గుర్తించి మరలమనగ
సింహమై లేచి జగతి శాసించగలము.

పశ్చిమము కేంద్రమై నేడు పరగువిద్య
మరల భారత కేంద్రమై వరల వలయు
భారతీయ పునాదులన్ ప్రక్కబెట్ట
ప్రగతి యన్నది సాధ్యమే పగిదియైన?

ఆనోభద్రాః క్రతవో యన్తు విశ్వతః - మన ప్రవృత్తి
అన్ని దిశల నుండి ఆలోచనలు తెచ్చి
స్వీయబుద్ధితోడ స్వీకరించి
మన పునాదులన్ని మరువకుండగ జూచి
గుణమునిచ్చు మనది గొప్ప విద్య.

విశ్వమందున్న జాతుల వినుతికెక్కె
భరతదేశము విద్యలన్ పసిడివోలె
అపర పరవిద్యలను నేర్చి అమృతమునిడె
(ఈశావాస్యోపనిషత్)
అట్టి విద్యలే అందరకంద వలయు

శతము శాతము అక్షరాస్యతనుగొన్న
పెద్ద జాతులీ జగతిని పెక్కుగలవు
మోసమున్ వీడిరా వారు? వీసమయిన
మోసకారుల (రోగ్ స్టేట్స్)లో బ్రిటన్
మొదట నిలుచు.

ఆధునికపు ప్రమాణాల ననుసరించి
అక్షరాస్యుల జేయుట అందరకును
అవసరము మాత్రమే కాదు, అదొక మొదటి
లక్ష్యముగ నెంచి సాగాలి లాఘవముగ.

సత్యధర్మాలు గరపెడి చదువులిచట
వేల సంవత్సరాలుగా వెల్లివిరిసె
ఇట్టి కీర్తి గడించిన హిందుజాతి
కూటికై నేర్చు విద్యలౌ కోరదెపుడు

వృత్తి విద్యలెన్నొ వేర్వేరు ఉన్నవి
కోటి విద్యలైన కూటి కొరకె
అనెడు సామెతొకటి అవగతము మనకు
కాని భుక్తి కొరకె కాదు విద్య

ఇలలో పుట్టిన జీవికి
అలవోకగ వృత్తి నేర్పి ఆదుకొన నిటన్
సులభపు వ్యవస్థ ఏర్పడె
కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా.

చదువుల ఫలశ్రుతి యేమన
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
(హిరణ్యకశిపుడు)
చదివిన ప్రహ్లాదుడు మరి
చదువులలో సారమెల్ల చవిగొనలేదా!

ఏమిటి మన చదువుల లక్ష్యం?

తన కొరకు మాత్రమేయని
మనుజుడు జీవించు నెడల మరణించినటే
తన సర్వము నితరులకై
వినయము నర్పించునట్టి విజ్ఞత వలయున్
(వివేకానంద)
ఆత్మవత్సర్వ భూతాని యనుభవమున
జీవులన్నిట తానున్న చింతనమును
అన్ని జీవులనాత్మలో అనుభవించు
ఆత్మజ్ఞానము నీయాలి అధ్యయనము
(ఈశావాస్యోపనిషత్)

అస్మదీయుల కొందర నాదరించి
ఇతరులని మిగిలిన వారినెంచబోక
వసుధ యంతయు తన కుటుంబమని తలచు
హృదయ సంస్కార మొసగెడి చదువు వలయు

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం 94401 56018