Others

ప్రియమణి.. లక్కీ చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘ బాహుబలి తరువాత ఎక్కువకాలం విశ్రాంతి తీసుకున్న దర్శకుడు రాజవౌళి కొత్త ఉత్సాహంతో మొదలెట్టిన బిగ్ ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్. మల్టీస్టారర్‌కు అచ్చమైన నిర్వచనంగా స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌తో స్క్రీన్‌కు ఎక్కిస్తున్న చిత్రమిది. సినిమా షూటింగ్ ఆరంభమైన దగ్గర్నుంచీ ఏదోక విశేషంతో వార్తల్లో కనిపిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ -ఇప్పుడు ఫిమేల్ ఆర్టిస్ట్‌కు సంబంధించి మరో హాట్ న్యూస్‌ను బయటకు వదిలింది. అదే -ట్రిపుల్ ఆర్ భారీ ప్రాజెక్టులో ప్రియమణికి కీలక పాత్ర దొరకటం. ఇటీవలి కాలంలో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రియమణికి -ట్రిపుల్ ఆర్ కొత్త లైఫ్ ఇవ్వొచ్చు. కీలక పాత్ర అన్న సమాచారమే తప్ప, క్యారెక్టరైజేషన్ వివరాలేమీ యూనిట్ నుంచి బయటకు పొక్కడం లేదు. ప్రియమణి గతంలో రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బా ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అరవింద సమేతలో ఎన్టీఆర్‌కు లవర్ రోల్‌లో నటించిన ఈషా, ట్రిపుల్ ఆర్‌తో మరోసారి ఎన్టీఆర్ పక్కన చాన్స్ కొట్టేసింది. కెరీర్ మందగించిన ప్రియమణికి, కెరీర్‌లో ఆలస్యంగా సినిమాలు అందుకుంటున్న ఈషాకి ట్రిపుల్ ఆర్ కొత్త లైఫ్ ఇస్తుందేమో చూడాలి.