Others

క్యాథరిన్.. స్పెషల్ ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణను ప్లాన్ చేసింది చిత్ర బృందం. కాగా ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి చిత్ర బృందం మొదటిగా ‘ఇలియానా’ని సంప్రదించింది. అయితే సాంగ్‌లో నటించడానికి ఒప్పుకున్న ఈ గోవా బ్యూటీ, రెమ్యూనరేషన్‌ని భారీమొత్తంలో డిమాండ్ చేసింది. దాంతో చిత్ర బృందం ఇక మళ్ళీ ఆమెను పక్కనపెట్టి యంగ్ హీరోయిన్ క్యాథరిన్ థ్రెసాను తీసుకోవాలని నిర్ణయించారు. క్యాథరిన్ గతంలో బోయపాటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన ‘్భరత్ అనే నేను’ ఫేమ్ కియారాఅద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.