Others

మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్ ఆఫ్ ఝాన్సీని కష్టాలు వెంటాడుతున్నాయి. షూటింగ్ టైంలోనే అష్టకష్టాలు పడిన ఝాన్సీ -నిర్మాణానంతర పనుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న మణికర్ణిక -ముందుకెళ్తుందా? లేదా? అన్న సందేహాలు ముసురుతున్నాయి. కారణం బయటకు పొక్కకున్నా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ చివర్లో తప్పుకోవడంతో -ఆ బాధ్యతను ‘మణికర్ణికే’ భుజాన వేసుకుంది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కీలక పాత్ర పోషించాల్సిన సోనూ సూద్ సైతం తప్పుకోవడంతో ప్రాజెక్టుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఏమాత్రం బెదరకుండా మిగిలిన పార్టును కంగనా సమర్థంగానే పూర్తి చేయగలిగింది. వచ్చే జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమేనని అనుకుంటున్న తరుణంలో -నిర్మాణానంతర పనులు నిర్వర్తించాల్సిన క్రూ ఎదరు తిరిగినట్టు తెలుస్తోంది. అందుక్కారణం -వేతనాలు చెల్లించక పోవడమే. రిలీజ్ డేట్‌కు అనుగుణంగా పనులు పూర్తి చేస్తున్నా, చెల్లించాల్సిన మొత్తంపై నిర్మాత పెదవి విప్పడం లేదన్నది వర్కర్క ఆరోపణ. వర్కర్లు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనులు పక్కనపెట్టేసి, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ను ఆశ్రయించార్ట. మూడు నెలలుగా పనులు చేస్తున్నా, లక్షల్లో పడిన బకాయిలు చెల్లించకుండా నిర్మాత కమల్ జైన్ బెదిరింపు సమాధానం ఇస్తున్నాడని వర్కర్లు మొరపెట్టుకున్నారు. పైగా సెట్లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని, సరైన భోజన సదుపాయం కూడా కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లేబర్ కమిషన్ వద్దే తేల్చుకుంటామని వర్కర్లు భీష్మించడంతో ప్రస్తుతానికి పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ సమస్యను నిర్మాత తరఫున మణికర్ణిక ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.