Others

నిన్ను మరచిపోవాలని.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్‌లో వచ్చిన ఓ మంచి చిత్రం -మంచి మనుషులు. ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులోని పాటలు మరో ఎత్తు. కారణం పాటలన్నీ హిట్ సాంగ్స్. అందుకే -ఈ సినిమాలోని పాటలన్నీ నాకు చాలా చాలా ఇష్టం. వాటిల్లో మరీ మరీ ఇష్టమైన పాట -నిన్ను మరిచిపోవాలని. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ఈ పాటను గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన తీరు, మామ కేవీ మహదేవన్ బాణీ కట్టిన విధానం అమోఘం. సినిమాను క్లుప్తుంగా చెప్పుకుంటే రాధ (మంజుల) ఆస్తిపాస్తులు కలిగిన రఘుపతిరావు (నాగభూషణం) కూతురు. మెడికల్ స్టూడెంట్. ఓసారి సిమ్లా ట్రిప్‌కు వెళ్లి అక్కడ గోపి (శోభన్‌బాబు)తో ప్రేమలో పడుతుంది. ప్రేమను నిరాకరించిన రఘుపతిరావు, రాధ కాలిగోటికి సరిపోవంటూ గోపీని కించపరుస్తాడు. అదే విషయాన్ని రాధకు లేఖద్వారా చెప్పేసి, అనారోగ్యంతోవున్న తల్లి వద్దకు వెళ్తాడు గోపి. ఆ ఉత్తరాన్ని మార్చేసిన రఘుపతి, కూతురికి తప్పుడు సమాచారమిస్తాడు. తరువాత గోపి, రాధలకు ఓ కుర్రాడు పుట్టిన విషయం బయటపడటం, నిశ్చితార్థమైన డాక్టర్ రమేష్ దగ్గర తన గతాన్ని దాచేందుకు రాధ ప్రయత్నించటం, బాబు కారణంగా భార్యభర్తలిద్దరూ కలవడంతో కథ సుఖాంతమవుతుంది. శోభన్‌బాబు, మంజుల, నాగభూషణం, అంజలీదేవి, మాస్టర్ బబ్లూ, రాజబాబు ఇలా అంతా తమ నటనతో మెప్పించారు. అలాంటి కథ కోసం ఆత్రేయ రాసిన ఓ పాట -నిన్ను మరిచిపోవాలని/ నిన్ను విడిచి వెళ్ళాలని/ ఎన్నిసార్లు అనుకున్నా/ మనసురాకమానుకున్నా’ అన్నది. పాటలో ‘ఎందుకిలా చేశావో నాకేమో తెలియదు/ నేను చచ్చిపోయినా నా మనసు చచ్చిపోదులే/ నిన్ను చేరువరకు నా కళ్లు మూతపడవులే..’ అంటూ గొప్పగా రాశారు. ఇటు హీరో అటు హీరోయిన్ మధ్యలో బాబు నలిగిపోతున్న సమయంలో ఆవేదనతో పాడే ఈ పాటంటే చాలా ఇష్టం. ఎన్నో కేంద్రాల్లో రజతోత్సవాలు, శత దినోత్సవాలు జరుపుకుందీ చిత్రం. ఇప్పటికీ ఈ పాటని మరువలేం. దర్శకులు మధుసూధనరావు దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో కనిపిస్తుంది. వీనుల విందైన ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప పాటే.

-సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్