నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం అవ్యక్తాయ నమః
బయటికేమీ తెలియని రూపమును కలిగి
ప్రాణికోటి ఎక్కడినుండి వచ్చి దేని
లో లయమగునో? ఆ లింగ లీల యేమొ?
కనుక ‘అవ్యక్తుడ’య్యె ముక్కంటి సామి
ఓం సహస్రాక్షాయ నమః
రంధ్రముల కుండ బోర్లింప ప్రమిద పైన
కన్నములనుండి ప్రసరించు కాంతి వోలె
నరుని జ్ఞానేంద్రియాలలో హరుని కాంతి
వచ్చు నతడె ‘సహస్రాక్షు’డిచ్చు వరము
ఓం అపవర్గప్రదాయ నమః
సుఖము వెంటనే దుఃఖము చూచి వెళ్ళు
దుఃఖమునకు వెనె్వంట సంతోషముండు
కష్ట దురదృష్టరహిత మార్గమున నిల్పి
చూపెడు ‘అపవర్గప్రద’ జ్యోతి యతడు
ఓం అనంతాయ నమః
భవుని ఆదిని కనలేదు బ్రహ్మ నాడు
అంతమగు చోటు కనలేదు హరియు కూడ
ఇంతకాదింత ఎంతెంతో ఎరుగరాని
ఊహకందని ‘అనంతు’ డాహరుండు

కడియాల మధుసూదన రావు 9030907191