Others

గంధర్వ గానంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు ఘంటసాల జయంతి సందర్భంగా)

సీ గంధర్వ గానంబు కన్నదా! విన్నదా!
వింటిమే మీ నోట వీనులార!
మంత్ర ముగ్థతయన్న మాటలా! ఆటలా!
కంటిమే! మీ చేత కన్నులార!
కారణ జన్మంబు కన్నదా! విన్నదా!
తెలిసె మీవలననే తెల్లముగను
గానామృతంబును కంటిమా! వింటిమా!
కంటిమే! మీదైన గళములోన
తె.గీ ఉన్నతోత్తుంగ హిమశృంగముండుదాక
పూర్వ పశ్చిమాంబుధులిల పొలయుదాక
నీదు స్వరగంగ నిరంతము నిలచియుండు
గానగుణశీల! రసలోల! ఘంటసాల!

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949