AADIVAVRAM - Others

కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పేరు వినగానే జంతువులకు కూడా హావభావాలు ఉంటాయా? అనిపించింది కదూ.. మనుషులకు ఉన్నట్లు జంతువులకు హావభావాలు లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో వాటి హావభావాలు నవరసాలను పోలి ఉంటాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఫొటోలు క్లిక్‌మనిపిస్తే ఆ ఫొటోలు అద్భుతంగా ఉంటాయి కదూ.. అలాంటి ఫొటోల్లో కొన్నింటిని 2018 కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలకు ఎన్నికయ్యాయి. అందులో షాక్ గురైనట్లున్న ఉడుత ఫొటో మొదటి బహుమతిని సంపాదించుకుంది. మెరీమెక్ గోవాన్ తీసిన ఈ ఫొటో మొదటి అవార్డుతో పాటు పీపుల్స్ చాయిస్ అవార్డు, క్రీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
* ఎంతటి చతురులైనా సముద్రంలోని షార్క్‌ను నవ్వించగలరా? అంత పెద్ద జీవిని నవ్వించాలంటే ఎంత పెద్ద జోక్ వేయాలి.. కానీ తానియా హోప్పర్‌మాన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఏం మాయ చేశాడో, లేక నిజంగా ఎలాంటి జోక్ వేసి ఆ షార్క్‌ను నవ్వించాడో తెలియదు కానీ సముద్రంలోని బ్లూషార్క్ నవ్వుతున్నట్లు ఫొటో తీశాడు. 3అండర్ ద సీ2 కేటగిరీలో ఈ ఫొటోకు ప్రైజ్ వచ్చింది.
* పిల్లలతో ఆడుకుంటున్నట్లు కనిపించే ఈ గుడ్లగూబను షేక్‌కీనా అనే వ్యక్తి ఫొటో తీశాడు. ఈ ఫొటోకు 3క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్2 ప్రైజ్ వచ్చింది.
* భారతదేశానికి చెందిన ఆర్ష్‌దీప్ సింగ్ తీసిన 3ఆశ్చర్యంగా చూసే గుడ్లగూబ2 ఫొటోకు జూనియర్ అవార్డు వచ్చింది.
* ఫిన్‌లాండ్‌కు చెందిన ఎలుగుబంటి కుటుంబాన్ని వాల్టేరీ మల్కాహేనెన్ అనే ఫొటోగ్రాఫర్ ఫొటో తీశాడు. ఎలుగుబంటి కుటుంబంలోని మూడు ఎలుగుబంటి పిల్లలు చెట్టెక్కి అమాయకంగా కిందకు చూస్తున్న ఫొటో 3అమేజింగ్ ఇంటర్నెట్ పోరిఫోలియో2 విభాగంలో అవార్డు గెలుచుకుంది.
* ఖడ్గమృగానికి నెమలి పింఛం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే విచిత్రంగా ఉంది కదూ.. కానీ భారత్‌లోని గోరుమరా నేషనల్ పార్క్‌లోని ఓ ఖడ్గమృగం ఇలా కనిపించింది. కాదు కాదు.. అలా ఫొటో తీశాడు ఫొటోగ్రాఫర్.
* విసిగివేసారి, తల పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఎలుగుబంటి ఫొటోను డేనియెల్ డీ ఎర్మో తీశాడు.
* ఫొటోగ్రఫీ ప్రొఫెషన్‌ని ఎంచుకున్న ఎలుగుబంటి భలే బాగుంది కదూ.. కెమెరా కళ్లలోంచి అచ్చు ఫొటోగ్రాఫర్ చూస్తున్నట్లు చూస్తోంది. ఈ ఫొటోను రోయ్‌గ్యాలిడ్జ్ అనే వ్యక్తి తీశాడు.
* పూల తీగలపై ఊయలలూగుతోంది ఈ బుడత ఉడుత. గీర్ట్‌వెగన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీశాడు.
* ప్రేయసీప్రియులను తలపించేలా ఉన్న ఈ కౌగిలింత.. సూపర్ కదూ.. ఈ ఫొటోను సర్గేయ్ సావీ తీశాడు.
* హీరోలు, విలన్లు ఫైటింగ్ చేసుకుంటున్నట్లుగా ఉంది కదూ ఈ ఫొటో చూస్తుంటే.. ఇక్కడ మాత్రం డూపులు లేరు సుమా.. ఈ ఫొటోను కూడా సర్గేయ్ సావీ తీశాడు.

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి