Others

దటీజ్ నయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద హీరోలతో ప్రాజెక్టు చేయాలంటే -ముందు హీరోయిన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అందులోనూ చిరంజీవిలాంటి సీనియర్‌తో ప్రాజెక్టు చేయాలంటే -హీరోయిన్ ఆప్షన్లు చూసుకోవాల్సిందే. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఆదరణ ఉన్న హీరోయిన్లనూ చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటివారిలో నయనతార, అనుష్క, త్రిష, శ్రీయ మాత్రమే సీనియర్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. వీళ్లందిరిలో నయన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోన్న విషయం కనిపిస్తోంది. కొరటాల శివ సైతం అదే ఆప్షన్ వెతుక్కున్నట్టు కనిపిస్తోంది. కొరటాల తదుపరి సినిమాను చిరంజీవితో చేయనుండటం తెలిసిందే. అందుకు సంబంధించి స్క్రిప్ట్‌పై కసరత్తు మొదలైందనీ అంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరుకు జోడీగా మరోసారి నయనతారనే తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో క్రేజ్ ఉన్న తారగా ఆమెనే ఎంపిక చేశారని అంటున్నారు. ఇప్పటికే చిరంజీవితో ‘సైరా’ ప్రాజెక్టు చేసిన నయన్, కొరటాల శివ ప్రాజెక్టుకూ ఆమె ఆప్షన్ అయ్యింది. నయన్ విషయంలో చిరు సైతం పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడంతో, కొరటాల ఆమెనే ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.