Others

లిప్ లాక్‌కు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ షో.. లిప్‌లాక్‌లకు సై అనడం- ఇవన్నీ కథ డిమాండ్ మేరకే ఉంటాయని కొందరంటారు. కానీ మరికొందరేమో కథ డిమాండ్ చేసింది అనేస్తారు. ఏదేమైనా లిప్‌లాక్ విషయంలో చాలామంది హీరోయిన్లు టెంప్ట్ అవుతున్నారు. తాజాగా తమన్నా ఇపుడు అలాంటి రాగమే అందుకుంది. తెలుగు సినిమాలో ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోందని.. ఇదో మంచి మార్పు అని చెబుతోంది. తనకూ బోల్డ్ సినిమాల్లో నటించాలని ఉందని, కాకపోతే తన వద్దకు అలాంటి కథలు ఇప్పటివరకూ రాలేదంటోంది. మరి లిప్‌లాక్‌లకు మీరు రెడీనా అని అడిగితే ‘‘అదేగా నేను చెబుతోంది’’ అని లౌక్యంగా సమాధానమిచ్చింది. ఇంతవరకూ తెలుగులో ఒక్క దర్శకుడు కూడా తన పాత్రలకు లిప్ కిస్ పెట్టలేదని, ఇపుడు టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది కాబట్టి ఫ్యూచర్‌లో ఎవరైనా అడుగుతారేమో చూడాలంటోంది. కండిషన్ ఏమంటే కథ డిమాండ్ చేయాలట. ఇదిలావుంటే తన తాజా చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’ గురించి తమన్నా మాట్లాడుతూ- సినిమా రొమాంటిక్‌గా ఉంటుంది.. కాని లిప్ కిస్‌లు లేవని చెప్పేసింది.