Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంఖాను పుంఖాలుగా సినిమాలు విడుదలవుతున్నా -తెలుగు ప్రేక్షకుడు ఒక్కదానికీ సరైన మార్కులు వేయడం లేదు. ముఖ్యంగా ఈ సీజన్ చిన్న సినిమాకు సరైన స్లాట్ ఇచ్చినా, విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర బతికి బట్టకట్టేకపోయాయ. ఈవారం చూస్తే.. రేష్మీగౌతమ్ అందాలు పెట్టుబడిగా వచ్చిన అంతం, సూర్య నటించి నిర్మించిన మేము (తెలగు అనువాదం) సహా ఫ్రెండ్ రిక్వెస్ట్, ఇద్దరం, ఆ ముగ్గురు చిత్రాలతోపాటు భారీ అంచనాలతో విడుదలైన సల్మాన్ సుల్తాన్ థియేటర్లకు వచ్చింది. వీటిలో ఒక్క సుల్తాన్ వినా, ఏ ఒక్క సినిమా ప్రేక్షకుడిని మురిపించలేకపోయంది. రేష్మీ గ్లామర్ మంత్రాతో అంతానికి అంతంతమాత్రం వౌత్‌టాక్ వచ్చి ఓ మాదిరి కలెక్షన్లు రాబడుతోంది. మూడువారాలు దాటినా ఇప్పటికీ బిచ్చగాడు పరుగులు తీస్తున్నాడు. లక్షల వసూళ్లు రాబడుతున్నాడు. నాని జెంటిల్‌మేన్, నితిన్ అఆ సినిమాలే ప్రేక్షకులకు ఇంకా దిక్కయ్యాయ.