Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన వెనుక తాను కూడా అవతారాల్ని ఎత్తుతూ ఉంటుంది. ఆ శక్తి మహాత్మ్యాన్ని వివరించే దేవీ భాగవతం మనకీ విషయాల్ని చెబుతుంది.
సరే- పరబ్రహ్మతత్త్వము శక్తి సంకల్పం వలన విష్ణువైతే- ఆ విష్ణువు శ్రీరామచంద్రునిగా అవతరిస్తే- పరాశక్తి అయిన మహాలక్ష్మీ స్వరూపమే సీతగా అవతరించింది. ఈ విషయానే్న శ్రీమద్రామాయణంలో సీతా యాశ్చరితం మహత్ అనే మాట నుండి వాల్మీకి మహర్షి అక్కడక్కడ ఆ మహత్తత్వ సంబంధమైన సీతా చరిత్రను పరాశక్తి అయిన లలితా పరంగా జ్ఞాపం చేస్తూనే ఉంటారు.
అయితే అలా ఎందుకు చెప్పాలి. స్పష్టంగా బహిర్గతం చేయవచ్చు కాదా! అంటే- శ్రీమద్రామాయణం కావ్యం. అది అనేక విషయాల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రధానమైన రామకథను చెబుతూ ఉంటుంది. మన మనస్సు యొక్క సారాన్ని బట్టి ఆ సూచనల్ని అందుకుంటూ మనం ముందుకు పోవాలి. అది ఋషిభావన.
కావ్యాలాపవినోదిన్యైనమః అని ఆ తల్లిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. కావ్యాలాపాలు అంటే కావ్య వాక్యాలు. అంటే వేదవాక్యాలు. వేద స్వరూపాలైన రామాయణాది మహాకావ్య వాక్యాలు. కనుక ఆమె రామాయణంలో సీతా రూపంగా విహరిస్తూ ఉంటుంది.
ఆంజనేయస్వామి వంటి శ్రీ విద్యోపాసకులను వినోదింపచేస్తూ ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని అక్కడక్కడ బహిర్గతం చేస్తూ ఉంటాడు. లలితాదేవికి.
మూలాధారం ఋజారూఢాయైనమః అన మనం నమస్కారం చేస్తూ ఉంటాం.
యోగ శాస్త్ర ప్రకారం మన శరీరంలో ఆరు చక్రాలు- కాకపోతే పద్మాలు ఉన్నాయి. ఆరు చక్రాలను భేదించి వాని అంతర్గతంగా ఉన్న శక్తిని కదిపి శిరోభాగంలో ఉన్న సహస్రారంలోనికి తీసకొని వెడితే ‘మధు’ ప్రాప్తి కలుగుతుంది.
మూలాధారమని ఆసనమందున్న రుూ చక్రం భూలక్షణం కలది. కేవల భూతత్వం కలిగిన ఆస్థానంలో అచేతనంగా ఉన్న మండలిని అనే శక్తిని కదల్చాలి. భూతత్వమును లాంగల పద్ధతిలో కదల్పవలెను. అప్పుడు ఆ తత్త్వము బయటపడుతుంది. జనక మహారాజు సీతావృత్తాంతాన్ని విశ్వామిత్ర మహార్షికి చెబుతూ-
అథమే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితామయా
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా
భూతలాదుత్థితా సాతు వ్యవర్థత మమాత్మజా.
అంటారు.
అంటే- జనక మహారాజు భూమిని కర్షక లక్షణంతో శోధిస్తూ ఉండగా ఈవిడ లేచింది. ఇక్కడ ‘ఉత్థితా’ అనడాన్ని మనం గమనించాలి. ఆ శక్తి సీతా అని విశ్రుతమైంది. అంటే తన పేరును తానే పెట్టుకొని లోకఖ్యాతి గడించింది. అంతేకాని- ఆమెకు నామకరణాన్ని కూడా జనకుడు చేయలేదు. ఆమెయే నా ఆత్మజగా వృద్ధి పొందింది. అమ్మవారికి అయోనిజ అని పేరు. శబల బ్రహ్మగా ఆవిర్భవించిన ఆశక్తికి కారణం అవ్యక్తం. ఇక్కడా అంతే.
తద్బాహ్యే హేమరూపాభాం వాదిపాంత చతుర్ధళం
ద్రుత హేమ సమప్రఖ్యం పద్మం తత్ర విచింతయేత్.
మూలాధారమందున్న నాలుగు దళాలలోను ‘‘వశషన’’ అను నాదాలలో సకారంము చివరనున్నది. భూలక్షణం కల నాగటి చాలునకు పుట్టింది.
సీత అయింది.
ఇదీ పరాశక్తిని జనకుడు పాసించిన స్థితి.
ఇదీ లలితా స్వరూపము.
ఇదీ పరాశక్తి రూపమైన మహాలక్ష్మి సీతగా ఆవిర్భవించి స్థితి. ఇటువంటి ఆ తల్లి సగుణ బ్రహ్మమైన రామచంద్రునిగా ఉన్న స్థితికారునకు లభించింది.
సీతా కళ్యాణమైనది. శ్రీరాముడు అయోధ్యాపురప్రవేశం చేసేడు. కాలం గడుస్తోంది. దశరధుడు పట్ట్భాషేకం చేస్తానన్నాడు శ్రీరాముడు నిజమనుకొన్నాడు.

- కాశీభొట్ల సత్యనారాయణ