Others

పోషకాల పండు సపోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మని రుచి, బోలెడన్ని పోషకాల సమాహారమే సపోటా. ఈ పండు తేలిగ్గా జీర్ణమవడమే కాకుండా శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. అందుకే ఈ పండును అందరూ ఇష్టపడతారు. ఇతర పండ్లతో పోలిస్తే ఈ పండు చాలా చవక కూడా.. ఈ సీజన్‌లో సపోటా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి అందరూ రోజుకో రెండు సపోటా పండ్లు తినడం చాలా మంచిది. సపోటా తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే..
* ఆయుర్వేదం ప్రకారం సపోటా వినియోగం శరీరంలోని వేడిని తగ్గించి వొంటిని చల్లబరుస్తుంది.
* నీరసంగా ఉన్నప్పుడు సపోటా పండ్లను తింటే, శరీరం అతి తక్కువ సమయంలో శక్తిని పుంజుకుంటుంది. అయితే ఇందులో చక్కెర పాళ్ళు అధికం గనుక మధుమేహులు పరిమితంగానే తీసుకోవాలి.
* సపోటాలో అధికంగా ఉండే ‘విటమిన్ ఎ’ కంటిచూపును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.
* సపోటాలోని పీచుపదార్థం మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. పెద్దపేగు కేన్సర్ ముప్పును సపోటా గణనీయంగా తగ్గిస్తుంది.
* మొలలు, ఫిస్ట్యులా బాధితులు తరచూ సపోటా తింటే రక్తస్రావం తగ్గుతుంది. పేగులు బలపడతాయి.
* మలబద్ధకం బాధితులు రోజూ గ్లాసు సపోటా రసంలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే సుఖ విరోచనం అవుతుంది. అలాగే.. ఆగకుండా విరేచనం అవుతున్నప్పుడు సపోటా తింటే విరేచనం అదుపు అవుతుంది.
* సపోటా వినియోగంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. తక్కువ సమయంలో గాయాలు కూడా మానిపోతాయి.
* మొలకెత్తిన రాగుల్ని ఎండబెట్టి పిండిపట్టి అందులో సపోటా గుజ్జు కలిపి సాయంత్రం వేళల్లో తింటే కాల్షియం లోపం తొలగిపోతుంది.
* గర్భిణులు సపోటా తింటే వారికి తగినన్ని పోషకాలు అందినట్లే..
* సపోటా రసంలో కొద్దిగా పాలు, చిటికెడు జాజికాయ, జాపత్రి, మరో చిటికెడు పచ్చకర్పూరం కలిపి రాత్రిపూట తాగితే సుఖనిద్ర సిద్ధిస్తుంది.
* సపోటా వినియోగం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి సీజనల్ అనారోగ్యాల బెడద బాగా తగ్గుతుంది.
* బిరుసైన, చిట్లిన జుట్టు మృదువుగా మారి బాగా పెరగాలంటే సపోటా తినాల్సిందే.. అలాగే చుండ్రు, మొటిమలు, ముఖం జిడ్డు కారటం వంటి ఇబ్బందులకూ సపోటా వినియోగం మంచి ఔషధం.
* సన్ ఎలర్జీ ఉన్నవారు ఎండలోకి వెళ్ళగానే చర్మం ఎర్రగా మరి దురద పెడుతుంది. వీరు రోజుకో రెండు సపోటా తింటే అందులోని విటమిన్ సి కారణంగా ఈ ఇబ్బంది దూరమవుతుంది.
* తరచూ సపోటా తినేవారి మానసిక ఆరోగ్యం బావుంటుంది. డిప్రెషన్, నిద్రలేమి, ఆందోళన వంటివి దరిజేరవు.
* వేడి చేసినప్పుడు కనిపించే పొడిదగ్గు, మూత్రంలో మంట, కడుపులో మంట, విరేచనంలో మంటకు సపోటా వినియోగం మంచి విరుగుడు.
* సపోటా, పెరుగు, పంచదార, చిటికెడు ఉప్పు, ఎండు ఖర్జూరాలను కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగాలి. తరచూ ఈ జ్యూస్ తాగేవారికి ఇందులో ఐరన్, కాల్షియం మూలంగా రక్తహీనత తొలగిపోవటమే కాక ఎముకలు గట్టిపడతాయి.
*