Others

ప్రకృతి గీతమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- శరత్కాలం -
తే.గీ. వర్షధారలు కురిపించి బడలిపోయి
కంధమాలిక లెల్లను గగనమందు
విశ్రమంబొందు శరదృతు వేళలోన
సర్మము వినిర్మలంబుగా, జరుగుచుండ
రాజు, రాజత్కళాపూర్ణ తేజమంద
రెండవ దివంబుగా నొప్పె రేయి యంత
ఘనధునీతట విమలసైకతము లెల్ల
వెండిదిబ్బలవోలెను వెలయుచుండె॥

తే.గీ. వనోద్రేకవంతయు నఁడగిపోయి
శాంతగంభీర చిత్తుడై సంచరించు
సాత్వికుని మాడ్కి, శారద సమయమందు
సన్నమై తిన్నగా సాగుచున్నది, నది॥

తే.గీ. క్రమ్ము పొగమంచు తెరలను గాంచినంత
ఇంద్రజాలికుడెవ్వడో ఎదుట తప్ప
అన్యమేదియు కన్పింపనటుల, కల్ప
నంబు జేసెనాయను రీతి నమరియుండె॥

తే.గీ. తారకలువోయి తెలతెలవారువేళ
దినము ప్రాదుర్భవించెడు దివ్యవేళ
ధరణినెల్లెడ గ్రమ్మిన దట్టమైన
తెల్లనౌమంచు తెరలను తేరిజూడ
క్షీర డిండీర మననొప్పె శిశిరవేళ॥

తే.గీ. వసుధలోపల చలిగాడు బరగుచుండె
ఆదమరచినచో నాతడదనుజూచి
చేరు తమ మధ్యకని భీతి చెంది మదిని
ప్రియుడు ప్రియురాలి కౌగిట బిగియబట్టె॥

ఆ.వె. చల్లదనము వలన సంకోచమందుట
శాస్తవ్రిహితరీతి జగతిలోన
అదియె తమకు గూడ అన్వయించుననగ
చలికి గువ్వలైరి జనములెల్ల॥

ఆ.వె. అర్ధబలము గల్గి, అధికారమును గల్గి
అంగబలము గల్గు, అయ్యలెపుడు
బలములేని వారి బాధించునట్టుల
వృద్ధ జనులకె, చలి భీతిగూర్చు॥

తే.గీ. సీతువను వ్యాఘ్రమన పెనుభీతి జెంది
తమదు దుప్పటిపొదలలో దాగుకొనిన
మనుజ సారంగతతులు క్రమక్రమముగ
అర్కుడనుధన్వి కరముల అభయమంది
బయలుదేరిరి పనులకై భయము వీడి॥

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949