Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ జననము, బాల్యము
వంగదేశమందలి కామారిపుష్కరము అను గ్రామమున క్రీ.శ.1836-వ సంవత్సరం ఫిబ్రవరి 18-వ తేదీన (్ఫల్గుణ శుక్ల ద్వితీయా బుధవారమున) శ్రీరామకృష్ణుడొక పేద బ్రాహ్మణ కుటుంబమున నుదయించెను. తండ్రి పేరు ఖుదీ రామచట్టోపాధ్యాయుడు, తల్లి చంద్రమణీదేవి. ఖుదీరాముడు దైవభక్తి పరాయణుడు, సత్యనిష్ఠాగరిష్ఠుడు, సుశీల వ్రతుడు, సత్యసంధతచే దనకును, కుటుంబమునకును ఎట్టి యిక్కట్లు వాటిల్లినను ఆతడణుమాత్రమైనను వ్రతమును విడువనొల్లని సత్యారాధకుడై యొప్పెను. ఒకప్పుడు తమ గ్రామమునందలి జమీందారుడు తనకనువగునట్లు కూటసాక్ష్యమును జెప్పుమని ఖుదీరాముని నిర్బంధింప, ఖుదీరాముడాతనిమాటలను తృణీకరించెను. దుర్మార్గుడగు ఆ జమీందారుడు ఖుదీరామునిపై బగబట్టి, యొక అసత్యపు వ్యాజ్యెమును దెచ్చి, యాతని పిత్రార్జితమునే కాక, అతనికిని కుటుంబమునకును నిలువనీడ నిచ్చుచుండిన కుటీరములను గూడ హరించెను. కాని ఖుదీరాముడిసుమంతయు చలింపలేదు. చంద్రమణీదేవియో, ఖుదీరామునకు దగిన సహధర్మచారిణి, సుగుణరాశి, శ్రీరామకృష్ణుని జననమునకుముందీ పుణ్యదంపతులు అతని దివ్యత్వమును సూచించుననేక దివ్యదర్శనములను దివ్యానుభవములను బడసినట్లు తెలియవచ్చుచున్నది.
శ్రీరామకృష్ణునకు దల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. (జగత్ప్రసిద్ధమగు శ్రీరామకృష్ణ నామము అతనికి గురువర్యులిడిన నామమని భావింపనగును.) పూవు పుట్టగనే పరిమళము తెలియునన్నట్లు గదాధరుని భావ్యౌన్నత్య సూచనలు బాల్యముననే పొడకట్టనారంభించెను. బాలసూర్యుని బోలునాతని దివ్యమూర్తి, ఆతని ప్రేమమయ ప్రవర్తనము, ఆతని ధైవైభవము జనుల సత్యద్భుతరీతి నాకర్షింపసాగెను. గదాధరుడన్నచో, ఇరుగుపొరుగు వారల కల్లారుముద్దు, తోడి బాలుర కాతడే నాయకుడు. కళాకౌశలమునకు నిలయమగు నాతని హృదయము ప్రకృతి సౌందర్యమున రమించెడిది. ధ్వనులలో, ఆకృతులలో, గల సూక్ష్మభేదములను మనుజుల రూపరేఖావిలాసముల యందలి వైచిత్య్రముల నాతడవలీలగా గ్రహించువాడు. అనుకరణము, హాస్యము, చిత్ర లేఖనము, మృణ్మయ విగ్రహ నిర్మాణము, వీధి నాటక ప్రదర్శ
(సన్న్యాసదీక్షా సమయమున గదాధరునకు ఆతని గురువరేణ్యుడగు శ్రీ తోతాపురి రామకృష్ణ నామము నిడియుండవచ్చునని శ్రీరామకృష్ణుని శిష్యుడగు శారదానందస్వామి ‘శ్రీరామకృష్ణ లీలా ప్రసంగు’అను తన సుప్రసిద్ధ వంగ గ్రంథమున దెలుపుచున్నాడు. (చూ.లీలాప్రసంగము, సాధక భావము, పుట 285.) మఱికొందఱు శ్రీరామకృష్ణుడర్చించిన దక్షిణేశ్వర కాళికాలయమునకు నిర్వాహకుడగు మధురనాధుడు ఈ నామమున గదాధరుని బిలిచెననియు నాటినుండియు ఈ నామము వ్యాప్తమైనదనియు జెప్పుచున్నారు.) నములు, సంకీర్తనము, రామకృష్ణాదిపురాణ పురుషధ్యానము- ఇవియే గదాధరుని బాల్య క్రీడలు. పాఠశాలయందలి నిర్జీవమైన విద్యావిధాన మాతని నాకర్షింపజాలకుండు టాశ్చర్యము కానేరదు. ప్రకృతి సౌందర్య రసాస్వాదనము మ్రోల గణితము మున్నగు విద్యలాతని కెంతమాత్రము గణనీయములు కావయ్యె. అతని యఖండ కళాభిమానమే, అంతరంగమునుండి తలనూపుచున్న యాతని బ్రాహ్మానంద పిపాసయే యిందులకు కారణమని చెప్పనొప్పును. కాని యాతని ధారణాశక్తియు, అసమానధీవైభవమును లౌకిక విద్యల నాతడభ్యసింపని లోటును పూర్తిగా దీర్చివైచెను. పండితులచే జరుపబడు పురాణ పఠనములను శాస్త్ర వ్యాఖ్యానమువలను నాతడాలకించి భారతీయ విజ్ఞాల ఖనులగు భారత భాగవతాది గ్రంథముల సారమును పూర్తిగా గ్రోలెను. జీవుల స్వభావ వర్తనములను బరిశీలించి-ప్రకృతియను గ్రంథమునాతడు ప్రత్యక్షముగా బఠించి- యందలి తత్త్వమును కరతలామలక మొనర్చుకొనెను. బడి చదువు నలక్ష్యము చేయుచుంచెనని తనయన్నయు పండితుడు నగు రామకుమారుడొకప్పుడు తన్ను మందలింప, ‘‘అన్నా! ఈ పొట్టకూటి చదువునాకెందులకు? ఇందులకు బదులు శాశ్వతానందదాయకము, శ్రేయస్కరమునగు తత్త్వజ్ఞానమును నేనార్జింపగోరుదును’’అని సమాధానము చెప్పెను. నిజమే, ఆత్మజ్ఞానదాయకమగు విద్యయే విద్య కాని మిగిలినదంతయు అవిద్య కదా!
శా. ‘‘ఏ వేదంబు పఠించె లూత? భుజగం బేశాస్తమ్రు ల్సూచెఁ? దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి? చెంచేమంత్ర మూహించె? బో
ధావిర్భావనిదానముల్ చదువులయ్యా కావు! నీ పాదసం
సేవా సక్తియెకాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!’’
ఇదియే చదువులయెడ శ్రీరామకృష్ణుని మనోభావము.
*
ఇంకావుంది...
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మెహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి