Others

గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా గతం చుట్టూ
కొన్ని పావురాలు ఎగురుతుంటాయి
నవ్విన అడుగుల్లోంచి
ఎగసిన పాదముద్రలను ఏరుకుంటూ
వర్తమానంలోంచి
భవిష్యత్తును కలగంటాయి
రేఖామాత్రంగానైనా
ఊహల్లో చిరు కదలిక!
జాలి కెరటం
హృదయతీరం మీదగా ఎగిసిపడి
చూపులపై వౌన సంతకం చేస్తాయి
గురి తప్పినశబ్దం
అంతర్లీనంగా
వౌన సంభాషణ చేస్తుంటే
వేల సంఖ్యలో కలల ప్రతిబింబాలు
వెలిగి ఆరిపోతున్నాయి!
సంఘర్షించినంత తేలిక్కాదు
సంభాషించడం
సంఘటన లోంచి
గాయాల సుడులపై
నడిచి వెళ్లిపోవడమే
ఇప్పటి కడసారి దృశ్యం
రేపు చెరిగిపోయినా
ఫర్వాలేదు
గతంలోంచి వర్తమానం
ఇంకిపోకుండా ఉంటేచాలు.

- మానాపురం రాజా చంద్రశేఖర్, 9440593910