Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి అనుగ్రహం వాళ్లకు కలిగింది. ఎందుకని? ఆమె- పంచ సంఖ్యోపచారిణి. ఐదిటివలన ఎప్పుడూ ఉపచారాలను పొందుతూ ఉంటుంది. ఏమిటీ పంచ?
భూమి నీరు నిప్పుగాలి ఆకాశం అనే రుూ మహాభూతాలు. వీటిచేత సేవింపబడే ఆ తల్లి ఈ అయిదుగురిని అనుగ్రహించింది. ఎందుకని! వీరు అవి ఒకటే కనుక. ఎలా?
ఇందులో- గాలి కొడుకున్నాడు. అగ్నిపుత్రుడున్నాడు. ఆకాశ భూత ప్రతీక సూర్యపుత్రుడున్నాడు. రజోగుణ ప్రతీక అయిన బ్రహ్మపుత్రుడున్నాడు. వరుణ పుత్రుడున్నాడు.
పంచ భూతాలకు ప్రతీకలుగా వీళ్ళామెను సేవిస్తున్నారు. ఆమె అనుగ్రహించింది. భాగ్యాల మూటనిచ్చింది. ఆనాడే సుగ్రీవునికి రాజ్యం వచ్చింది. ఆ తల్లికీ రాజ్యదాయినీ అని పేరు. సుగ్రీవుడు ఒక్కడే అలా సేవించేడు. రాజ్యం వచ్చింది. ఈ విషయానే్న సుందరకాండలో - ఎదరెదర-
ఐశ్వర్యం వానరాణానాం దుర్లభం వాలిపాలితం
అస్యానిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక్ సత్కృతః
అని అనుకొంటాడు హనుమ.
ఈ విధంగా పంచవటిలో విహరించే సీత పంచవానరులను అనుగ్రహించి రావణ మృత్యురూపంగా లంకాప్రవేశం చేసింది. ఆ తరువాత శ్రీరాముడు సీతానే్వషణ చేస్తూ సుగ్రీవ స్నేహంచేసేడు. వాలి సంహారం చేసేడు.
సుగ్రీవ పట్ట్భాషేకం చేసేడు.
సుగ్రీవుడు సీతానే్వషణంకొరకు నాలుగుదిక్కులకు తన వానరుల్ని పంపించేడు. మూడుదిక్కుల నుండి వానరులు తిరిగి వచ్చేరు. సీతా దర్శనం జరుగలేదు. అయితే-
దక్షణ దిక్కుకు వెళ్ళిన హనుమ అంగదజాంబవతాదులు సీతానే్వషణం చేస్తూనే ఉన్నారు. సంపాతి అనే పక్షివలన సీత లంకలో ఉందనే విషయాన్ని తెలిసికొన్నారు. లంకను చేరడానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రం అడ్డు ఉంది. అశక్తులయిన వానరులు ప్రగల్భాలు పలికేరు. చివరకు జాంబవంతుని బుద్ధివైభవంతో ఆంజనేయస్వామిని ప్రార్థించేరు. స్వామి నిజవైభవాన్ని స్ఫురణకు తెచ్చేరు. ఆ స్వామి జ్ఞాతి శోకాన్ని జాతి శోకాన్ని పోగొట్టటంకోసం.
సవేగవాన్ వేగసమాహితాత్మా
హరిః ప్రవీరః పరవీరహంతా
మనస్సమాధాయ మహానుభావో
జగామ లంకాం మనసామనస్వీ- వెళ్ళిపోయేడు
దేహధర్మంగా స్వామి యిక్కడ ఉన్నా మనోధర్మంగా అప్పుడే లంకలో ప్రవేశించేడు. ఇదీ ఉత్సాహవంతుల లక్షణం. ఇందుకూ- అంటే తనకున్న దైన్యంతోబాటు ఎదుటివారి దైన్యాన్ని పోగొట్టడంకోసం సుందరకాండ పారాయణను చేయాలి.
ఏమిటీ సుందరకాండ!
సుందరుని కాండ- ఎవరీ సుందరుడు. ఆంజనేయస్వామి ఆయనయొక్క సాహసం- ఉత్సాహం- ధర్మదృష్టి-అనే్వషణ విస్తరించిన కాండ సుందరకాండ.
అంతేకాదు-
సౌందర్య మయమయిన కాండ. ఏమా సౌందర్యం?
ఒకటి- లంకా బహ్యసౌందర్యం.
దానిని కాదనుకొని లోనికి వెళ్ళగలిగితే
రెండు- సీతారూప ఆత్మరూప అంతఃసౌందర్యం. సుందరి అంటే బాలాత్రిపురసుందరి. ఆవిడ ఏకాకిని అయి కనిపించే కాండ. ఇవికాక ఆకాండను చదివితే- తత్త్వాన్ని గ్రహిస్తే కవితాపరిమళాన్ని ఆఘ్రాణిస్తే- మన జీవితాలు సౌందర్య మయములవుతాయి. అందుకని అది సుందరకాండ ఇలా ఎన్నోవిధాల అది సుందరకాండ.

- కాశీభొట్ల సత్యనారాయణ